Apr 27,2023 00:00

విద్యార్థులకు చెక్కును అందిస్తున్న కలెక్టర్‌ మల్లికార్జున తదితరులు

జిల్లాలో 43,938 మంది విద్యార్థులకు ప్రయోజనం
ప్రజాశక్తి -ఎంవిపి కాలనీ :
జగనన్న వసతి దీవెన కింద 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి జిల్లాలో రూ.41.17 కోట్లు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి జమ చేశారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి ప్రారంభించగా, జిల్లా స్థాయిలో కలెక్టర్‌ ఆధ్వర్యాన నిర్వహించారు. విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా రూ.41,17,45,000 మొత్తాన్ని చెక్కు రూపంలో జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున ప్రజా ప్రతినిధులతో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ విశాఖపట్నం జిల్లాకు 43,938 మంది విద్యార్థులకు సంబంధించి వారి తల్లుల బ్యాంకు ఖాతాల్లో రూ.41.17 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. వసతి దీవెనకు సంబంధించి ఏమైనా సమస్యలుంటే సచివాలయంలో తెలియజేస్తే పరిష్కరిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ కెఎస్‌.విశ్వనాథన్‌, సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ రమణమూర్తి, జిల్లా బిసి సంక్షేమాధికారి శ్రీదేవి, డిసిఎంఎస్‌ చైర్‌పర్సన్‌ పల్లా చిన్నతల్లి, పలు కార్పొరేషన్ల చైర్‌పర్సన్లు, చైర్మన్లు పిళ్లా సుజాత, మధుసూదన్‌, పిళ్ళా సుజాత, నూకరాజు, అప్పలకొండమ్మ తదితరులు పాల్లొన్నారు.