Jun 13,2023 00:25

జగనన్న విద్యాకానుక అందజేస్తున్న బూచేపల్లి వెంకాయమ్మ

ప్రజాశక్తి-చీమకుర్తి : విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ తెలిపారు. మండల పరిధిలోని దేవరపాలెం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, స్థానిక రామ్‌నగర్‌ ప్రాధమిక పాఠశాలలోని విద్యార్థులకు జగనన్న విద్యా కానుక సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వెంకాయమ్మ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో పెను మార్పులు తెచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ చల్లా అంకులు, లయన్స్‌క్లబ్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్‌ జవహర్‌, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు భాస్కరశాస్త్రి, వీరారెడ్డి, మున్సిపల్‌ కౌన్సిలర్లు తప్పెటబాబూరావు,ఏ రామబ్రహ్మం, యల్లయ్య, పొదిలి బాలకాశయ్య, ఉపాధ్యాయులు శివపార్వతి, శ్రీనివాసరావు, నసీమాభాను పాల్గొన్నారు. కంభం రూరల్‌ : స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు జగనన్న విద్యా కానుక పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి చేగిరెడ్డి.తులసమ్మ, ఎంఇఒ బి.మాల్యాద్రి, ఉపాధ్యాయులు, సిఆర్‌పిలు, జ్యోతి శ్రీమన్నారాయణ మూర్తి, శ్రీనివాసరావు, పి.శంకరరావు, పి.వెంకటరావు, నాగేశ్వరరావు, శ్రీనివాసరావు, కె.హనుమంతరావు పాల్గొన్నారు. పర్చూరు :మండల పరిధిలోని నాగులపాలెం ఎంపిపిఎస్‌ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంఇఒ డి.నాగేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులు జగనన్న విద్యా కానుక కిట్లను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్‌పిటిసి కొల్లా సుభాష్‌ ఎంపిటిసి ఎం.సరోజిని, సర్పంచి డి.సుధారాణి, పాఠశాల కమిటీ చైర్మన్‌ కె.స్వప్న, ప్రధానోపాధ్యాయులు ప్రసాద్‌బాబు, యు.రాధిక, విద్యార్ధుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. భట్టిప్రోలు : స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు విద్యా కానుక కిట్లను జడ్‌పిటిసి టి.ఉదరు భాస్కరి, ఎంపిపి డివి. లలితకుమారి చేతుల మీదుగా అందజేశారు. ఐలవరం, వెల్లటూరు, పెసర్లంక, పెదపులివర్రు, పల్లెకొన ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థులకు జగనన్న విద్యాకానులక కిట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచి మాచర్ల కొటేశ్వరరావు, ఎంపిటిసి మురుగుడు శ్రీనివాసరావు, పాఠశాల ప్రధానోపాధ్యా యుడు మోహనరావు, నాయకులు బాలాజీ,మల్లేశ్వరరావు పాల్గొన్నారు. చెరుకుపల్లి : మండల పరిధిలోని ఆరేపల్లి ఎంపియుపి పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ శ్రీనివాసరావు, నవీన్‌ కుమార్‌, సర్పంచి మొగిలిపువ్వు కోటేశ్వరరావు, ఉపాధ్యాయులు, పాల్గొన్నారు. బాపట్ల రూరల్‌ : మండల పరిధిలోని అప్పికట్ల ప్రభుత్వ ఉర్దూ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీ చేశారు. డిఐ నజ్మా ఖాతున్‌ చేతుల మీదుగా విద్యార్థులకు యూనిఫాం, బ్యాగుల,పుస్తకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎంసి చైర్మన్‌ షేక్‌ నస్రీన్‌, ఉపాధ్యాయురాలు షకీలా బేగం పాల్గొన్నారు.పిట్టలవాని పాలెం : పిట్టలవాని పాలెం ఎస్‌సి కాలనీలోని మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు వైస్‌ ఎంపిపి చేబ్రోలు కపానందం చేతుల మీదుగా జగనన్న విద్యా కానుక కిట్లు అందజేశారు. ఈ సందర్భంగా కపానందం మాట్లాడుతూ విద్యార్థులు జగనన్న విద్యాకానుక కిట్లను సద్వినియోగం చేసుకొని చదువులో రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో పేరెంట్స్‌ కమిటీ చైర్మన్‌ దాసి సుజాత, ఉపాధ్యాయులు అమరనాథ్‌, రమేష్‌ బాబు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. చీరాల : విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం వరుసగా నాలుగో ఏడాది కూడా జగనన్న విద్యాకానుకను అందిస్తుందని డాక్టర్‌ తాడివలస దేవరాజు అన్నారు. పేరాల హైస్కూల్‌లో చదువుతున్న విద్యార్థులకు ప్రధానోపా ధ్యాయుడు బి.సాల్మన్‌ రాజు,వార్డు కౌన్సిలర్‌ మల్లెల లలిత రాజశేఖర్‌,డాక్టర్‌ తాడివలస దేవరాజ్‌ చేతుల మీదుగా జగనన్న విద్యాకానుక కిట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానో పాధ్యాయుడు సాల్మన్‌, జిల్లా సైన్స్‌ కో ఆర్డినేటర్‌ పవని భాను చంద్ర మూర్తి గాంధీ ,చంద్ర ,ప్రసన్న కుమారి వెలుగొండా రెడ్డి ,కష్ణ మోహన్‌ రాజేంద్రప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. నగరం : స్థానిక యుపి పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఎంపిపి చింతల శ్రీకష్ణయ్య చేతుల మీదుగా జగనన్న విద్యాకానుక కిట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపిపి మాట్లాడుతూ విద్యార్థులు జగనన్న విద్యాకానుక కిట్లను సద్వినియోం చేసుకొని చదువులో రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఇఒ హరిబాబు, ఎంపిడిఒ ,నగరం సర్పంచి ఇంకొల్లు రామకష్ణ, జడ్‌పిటిసినాగమని,విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అద్దంకి : ప్రభుత్వం అందిస్తున్న జగనన్న విద్యా కానుక కిట్లను విద్యార్థులు సద్వినియోగం ప్రధానోపాధ్యాయుడు కెవి.శ్రీనివాసరావు తెలిపారు. మండల పరిధిలోని చక్రాయపాలెం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం అందించిన జగనన్న విద్యా కానుక కిట్లను సోమవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యాకమిటీ చైర్మన్‌ గూగుల్‌ మోడీ పార్వతి, గామ సర్పంచి నగేష్‌, మారుతి, వంకాయలపాటి తిరుమల వరలక్ష్మి, గోగులమూడి నాగరాజు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. మండల పరిధిలోని ధర్మవరం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాయుడు వి.శ్రీనివాసరావు, ఎంపిపి అవిశన జ్యోతి , గ్రామ సర్పంచి చావల కల్యాణి , విద్యా కమిటీ చైర్మన్‌ కుంచాల ఆంజనేయులు, గ్రామస్తులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
మండల పరిధిలోని బొమ్మనంపాడు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్య్కమంలో ప్రధానోపాధ్యాయుడు సిహెచ్‌. శ్రీనివాసమూర్తి, విద్యా కమిటీ చైర్మన్‌ పెట్లూరి శాంతి, సర్పంచి గోరంట్ల పద్మావతి, ఎంపిటిసి కామేపల్లి నాగేంద్రమ్మ తదితరులు పాల్గొన్నారు. కొల్లూరు : మండల పరిధిలోని తోకలవాని పాలెంలో గ్రామ సర్పంచి టి.కష్ణమోహన్‌ ఆధ్వర్యంలో విద్యార్థులకు చాకెట్లు, గులాబీ పూలు ఇచ్చి పాఠశాలోకి ఆహ్వానించారు. ఈ సందర్‌భంగా కష్ణమోహన్‌ మాట్లాడుతూ విద్యార్థులు ప్రతి రోజూ పాఠశాలకు రావాలన్నారు. క్రమ శిక్షణతో చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. కారంచేడు : మండల పరిధిలోని కొడవలివారి పాలెం జిల్లా పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లను సర్పంచి కొడాలి మోహన్‌ కష్ణ అందజేశారు. ఈ సందర్భంగా మోహన్‌ కష్ణ మాట్లాడుతూ విద్యార్థులు జగనన్న విద్యాకానుక కిట్లను సద్వినియోగం చేసుకొని చదువులో రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఉమామహేశ్వరరావు ,ఎంపిటిసి వనజ ,పంచాయతీ కార్యదర్శి జయ ప్రకాష్‌ తదితరలుఉ పాల్గొన్నారు. ఇంకొల్లు రూరల్‌ : స్ధానిక బాలికోన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థునులకు ఎంపిపి బండారు అనూష చేతుల మీదుగా జగనన్న విద్యాకానుక కిట్లు అందజేశారు, ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ ఎం.రాజ్యలక్ష్మి, ఎపిఒ టి.మోహన్‌రావు, వైసిపి మండల కన్వీనర్‌ బండారు ప్రభాకర్‌, వైస్‌ ఎంపిపి తూమాటి చలమయ్య, పాఠశాల పేరెంట్స్‌ కమిటీ చైర్మన్‌ కె.మల్లికార్జున్‌, వైస్‌ చైర్మన్‌ కె.పద్మావతి, ప్రధానోపాధ్యాయురాలు వి.ఉదయకుమారి, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.