Jun 13,2023 20:26

ఆదోనిలో కిట్లను అందజేస్తున్న ఉపాధ్యాయులు, నాయకులు

ప్రజాశక్తి-ఆదోనిరూరల్‌
మండలంలోని పెద్దహరివణం కన్నడ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు మూకప్ప, సర్పంచి రాము, విద్యా కమిటీ ఛైర్మన్‌ తిప్పన్న ఆధ్వర్యంలో మంగళవారం విద్యాకానుక కిట్లను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చి, ప్రయివేట్‌, కార్పొరేట్‌ పాఠశాలలకు ధీటుగా విద్యను బోధిస్తున్నట్లు తెలిపారు. వైసిపి సీనియర్‌ నాయకులు మెడికల్‌ నాగరాజు, హనుమంతప్ప, బాలప్ప, సంతోష్‌, వీరేష్‌, బలరాం, నాగరాజ్‌, డీలర్‌ మారెప్ప పాల్గొన్నారు. దేవనకొండ మండలంలోని పి.కోటకొండ గ్రామ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వరమ్మ ఆధ్వర్యంలో వైసిపి నాయకులు మీనుగ కృష్ణ, పెద్ద లింగన్న, రంగడు జగనన్న కానుక కిట్లను పంపిణీ చేశారు. పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. హోళగుంద మండలం ఎల్లార్తి గ్రామం బీసీ కాలనీ ఎంపియుపి కన్నడ పాఠశాల విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లను ప్రధానోపాధ్యాయులు విజయమ్మ, యువ నేత ఎస్‌కె.గిరి చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. పాఠశాల ఛైర్మన్‌ లక్ష్మి, ఉపాధ్యాయులు సుచరిత, శరణ బసవ పాల్గొన్నారు.