
ప్రజాశక్తి -ఎంవిపి కాలనీ
జగనన్న తోడు పథకం ద్వారా 2023 సంవత్సరానికి గాను ఏడవ విడత రుణ సాయం మంగళవారం విడుదల చేశారు. విశాఖపట్నం జిల్లాకు సంబంధించి 22,573 మంది లబ్ధిదారులకు జగనన్న తోడు పథకం కింద రూ. 24.31 కోట్లు రుణ సాయం లబ్ధి చేకూరింది. జిల్లాలో రుణ సాయం సక్రమంగా చెల్లించిన లబ్ధిదారులకు వడ్డీ మాఫీ కింద మొత్తం 18,182 మందికిగాను రూ.43.32 లక్షలు జమ చేయడం జరిగింది. ఈ సందర్భంగా విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లిఖార్జున మాట్లాడుతూ జగనన్న తోడు పథకం కింద అర్హత కలిగిన చిరు వ్యాపారులకు రూ.10 వేలు రుణం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో భీమిలి, గాజువాక ఎమ్మెల్యేలు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, తిప్పల నాగిరెడ్డి, జివియంసి కమిషనర్ సియం సాయికాంత్ వర్మ, నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సుభద్ర, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, నెడ్ క్యాప్ చైర్మన్ కె.కె.రాజు, డిఆర్డీఏ పి.డి శోభారాణి తదితరులు పాల్గొన్నారు.
అనకాపల్లి : అనకాపల్లి జిల్లాలో 17,314 మందికి 18.64 కోట్ల రూపాయలు జగనన్న తోడు ఆర్డికసాయం విడుదల అయినట్టు ఎంపీ డాక్టర్ సత్యవతి, నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్, కలెక్టర్ రవి పటాన్ శెట్టి తెలిపారు. ఈ మేరకు జగనన్న తోడు చెక్కును మంగళవారం కలెక్టరేట్లో విడుదల చేశారు. వడ్డీ రాయితీ కింద అనకాపల్లి జిల్లాలో 6,998 మందికి రూ.16.64 లక్షలు లబ్దిదారుల అకౌంట్ల జమచేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బి. వరాహసత్యవతి, డిఆర్డీఏ పిడి లక్ష్మిపతి, మెప్మ పీడి సరోజినీ, శంకరం సర్పంచ్ మొల్లి లక్ష్మి రామకష్ణ, లబ్దిదారులు పాల్గొన్నారు.