చెక్కు అందజేస్తున్న కలెక్టర్ రవి పఠాన్‌శెట్టి, జెసి కల్పనాకుమారి తదితరులు
ప్రజాశక్తి- అనకాపల్లి
జగనన్న తోడు పథకంతో చిరు వ్యాపారులు, సాంప్రదాయ కళాకారులు, వీధి వ్యాపారులకు ఎంతో ఊరట లభిస్తుందని కలెక్టర్ రవి పఠాన్ శెట్టి అన్నారు. జిల్లాకు విడుదలైన ఆరో విడత జగనన్న తోడు ఆర్థిక సహాయాన్ని బుధవారం కలెక్టరేట్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో కొత్తగా 12,964 మందికి రూ.12.96 కోట్లుతో పాటు, గతంలో రుణాలు పొంది అర్హులైన 20,441 మందికి రూ.34.12 లక్షలు వడ్డీగా వారి వారి ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు. జిల్లాలో గత ఐదు విడతలుగా 94,597 మందికి 97 కోట్ల వెయ్యి రూపాయలు అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, డిఆర్‌డిఎ పీడీ లక్ష్మీపతి, మెప్మా పీడీ సరోజినీ, డిఎల్‌డిఓ మంజుల వాణి, లబ్ధిదారులు పాల్గొన్నారు.










