Jul 28,2023 01:18
లబ్ధిదారులకు పత్రాలు అందజేస్తున్న కరణం వెంకటేష్‌, ఎమ్మెల్సీ పోతుల సునీత

ప్రజాశక్తి-చీరాల: జగనన్న సురక్ష కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సేవలు జరుగుతున్నాయని నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ కరణం వెంకటేష్‌ అన్నారు. గురువారం మండలంలోని వాడరేవు గ్రామంలో ఏర్పాటు చేసిన జగనన్న సురక్ష కార్యక్రమంలో కరణం వెంకటేష్‌ హాజరై మాట్లాడారు. మండలంలోని వాడరేవు1, 2 సచివాలయం జగనన్న సురక్ష కార్యక్రమం జరిగింది. వాడరేవు 1,2 సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో వైసీపీ ఇన్‌చార్జ్‌ కరణం వెంకటేష్‌ పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు విద్యార్థులకు అవసరమైన సర్టిఫికెట్‌లను, ప్రజలకు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి సంక్షేమ పథకాన్ని అందించాలన్న ముఖ్య ఉద్దేశమే జగనన్న సురక్ష కార్యక్రమం అన్నారు. సురక్ష కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు పోతుల పాల్గొని జగనన్న సురక్షను అందరూ వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల ఆర్‌బికె చైర్మన్‌ కావూరి రమణారెడ్డి, గ్రామ పంచాయతీ స్పెషల్‌ ఆఫీసర్‌ మరియు మండల వ్యవసాయ అధికారి ఐ సుమతి, హౌసింగ్‌ ఏఈ శ్రీనివాసులు, మాజీ సర్పంచ్‌ ఎరిపిల్లి రమణ, గడ్డం శ్రీను, అక్కల శ్రీనివాసరెడ్డి, మచ్చా సువార్త, పిక్కి నారాయణ, ప్రేమ్‌చంద్‌, రామిరెడ్డి, జోగి బ్రహ్మానంద రెడ్డి, రాజా బాబు, కోటి వెంకట్రావు, చావలి వాసు, నాదెండ్ల కోటేశ్వరరావు, గుంటూరు వెంకట సుబ్బారావు, బుర్ల మురళి, ధనుంజయ, అంకాల రెడ్డి, అద్దంకి రెడ్డి, గవిని నారాయణ, దేవేంద్ర, సచివాలయం కన్వీనర్లు, జెఏసి మండల కన్వీనర్లు, గృహ సారథులు, వాలంటీర్లు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.
సంతమాగులూరు: దేశంలో ఎక్కడా లేనివిధంగా సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టి, పరిపాలనను పేద వానికి అందుబాటులోకి తీసుకువచ్చిన ఘనత ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికే దక్కిందని రాష్ట్ర శాప్‌ నెట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌, వైసిపి అద్దంకి నియోజకవర్గం కన్వీనర్‌ బాచిన కృష్ణ చైతన్య తెలిపారు. గురువారం మండలంలోని వెల్లలచెరువు గ్రామంలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని మూడో రోజు కొనసాగిం చారు. ఈ సందర్భంగా చైతన్య గ్రామంలోని గడప గడపకూ వెళ్లి ఇప్పటివరకు ఆయా కుటుంబాలకు అందుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు, నవరత్న పథకాల ద్వారా చేకూరిన లబ్ధిని వివరించారు. వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది పనితీరును ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చైతన్య మాట్లాడుతూ, అర్హులైన ఏ ఒక్క కుటుంబం సంక్షేమానికి దూరం కాకూడదనే గొప్ప లక్ష్యంతోనే జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా అన్ని రకాల ధ్రువీకరణ పత్రాలు ఉచితంగా అందించినట్లు తెలిపారు. వివక్షకు తావులేని పరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డిని మరోసారి మళ్లీ ముఖ్యమంత్రి పీఠంపై నిలపాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి అడవి శ్రీనివాసరావు, వైసిపి మండల కన్వీనర్‌ చింతా రామారావు, సొసైటీ అధ్యక్షులు చింతా శ్రీధర్‌, నాయకులు ఆలూరి శ్రీనివాసరావు, అట్లా పెద్ద వెంకటరెడ్డి, విప్పల ముసలారెడ్డి, డి గాలెయ్య, మోదేపల్లి శ్రీనివాసరావు, పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.