Jul 18,2023 22:52

శ్రీకాకుళం అర్బన్‌ : ధ్రువపత్రాన్ని అందజేస్తున్న మంత్రి ధర్మాన

ప్రజాశక్తి- బూర్జ: ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి పరిపాలన యావత్తు దేశానికి ఆదర్శవంతంగా నిలుస్తుందని శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. మండలంలోని కాళ్లపర్తి, ఉప్పినివలస గ్రామల్లో మంగళవారం నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను నేరుగా పరిష్కరించేందుకే ప్రభుత్వం జగన జగనన్న సురక్ష' కార్యక్రమాన్ని అమలు చేస్తోందని అన్నారు. గతంలో ప్రజా సమస్యలు, అవసరాలు తీరాలంటే ప్రభుత్వ కార్యాలయాలు, అధికారులు చుట్టూ తిరిగితే గాని సమస్యలు పరిష్కారం అయ్యేవికావన్నారు. కానీ, బెటర్‌ ఫర్‌ ది చేంజ్‌ గా భావించి మొట్ట మొదటిసారి ఏ ప్రభుత్వమూ తలపెట్టలేని విధంగా వాలంటీర్లు, అధికారులు ప్రజల ఇంటివద్దకు వెళ్లి వారికీ అవసరమైన ధ్రువపత్రాలను, సంక్షేమ పథకాలను అందించడానికి తక్షణ చర్యలకు జగనన్న చేస్తున్న ప్రయత్నం చరిత్రలో నిలుస్తుందని అన్నారు. అనంతరం 11 రకాల ధ్రువపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఎంపిపి ప్రతినిధి కర్ణేన నాగేశ్వరరావు, జెడ్‌పిటిసి బి.రామారావు, వైస్‌ ఎంపిపిలు బుడుమూరు సూర్యారావు, కరణం కృష్ణం నాయుడు, పిఎసిఎస్‌ అధ్యక్షులు బగాది నారాయణమూర్తి, డిసిసిబి డైరెక్టర్‌ జల్లు బలరాంనాయుడు, మండల పార్టీ కన్వీనర్‌ పార్టీ కన్వీనర్‌ వెంకటరావు, సర్పంచ్‌ బిర్లంగి వరహాల నాయుడు పాల్గొన్నారు.
మోసకారి చంద్రబాబు
శ్రీకాకుళం అర్బన్‌ : ఎన్నికల ముందు ప్రజలకు అనేక హామీలు ఇవ్వడం, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పక్కన పెట్టి ప్రజలను మోసం చేయడం చంద్రబాబుకు కొత్తేమీ కాదని, మళ్లీ ఎన్నికలు వస్తున్నాయని ప్రజల మధ్యకు వచ్చి అనేక హామీలు ఇచ్చి మరోసారి మోసానికి సిద్ధమవుతున్నారని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. నగరంలోని పెద్దరెల్లి వీధి, కంపోస్టు కాలనీ, శ్రీకాకుళం మండలం మండలం సింగుపురం, గార మండలం నిజమాబాద్‌ గ్రామాల్లో నిర్వహించిన జగనన్న సురక్షలో పాల్గొన్నారు. ఈ మేరకు 11 రకాల ధ్రువపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఎస్‌టి కమిషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ డి.వి.జి.శంకరరావు, ఎంపిపి గొంగు రఘు రాం, ఎఎంసి చైర్మన్‌ ముకళ్ల తాతబాబు, సర్పంచ్‌ గుండ ఆదిత్యనాయుడు, తహశీల్దార్‌ వెంకటరావు పాల్గొన్నారు.
లావేరు : మండలంలోని లావేటిపాలెం-2లో నిర్వహించిన జగనన్న సురక్షలో ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌ పాల్గొని 11 రకాల ధ్రువపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక ఆహ్వానితులు రొక్కం బాలకృష్ణ, జెడ్‌పిటిసి మీసాల సీతంనాయుడు, ఎంపిడిఒ కుప్పలి సురేష్‌ కుమార్‌, తహశీల్దార్‌ సాధు దిలీప్‌ చక్రవర్తి పాల్గొన్నారు.
కొత్తూరు : మండలంలోని కుంటిభద్ర సచివాలయంలో నిర్వహించిన జగనన్న సురక్షలో ఎమ్మెల్యే రెడ్డి శాంతి పాల్గొని 11 రకాల ధ్రువపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో జెడ్‌పిటిసి కె.భాగ్యవతి, పిఎసిఎస్‌ చైర్మన్‌ చింతాడ సూర్యనారాయణ, ఎంపిడిఒ ఎం.పావని, సర్పంచ్‌లు పి.సాధుబాబు, కె.రత్నాలు పాల్గొన్నారు.
పలాస : పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని నర్సిపురం, శ్రీనివాస్‌ నగర్‌లో నిర్వహించిన జగనన్న సురక్షలో చైర్మన్‌ బల్ల గిరిబాబు పాల్గొని 11 రకాల ధ్రువపత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ బోర కృష్ణారావు, ప్రభుత్వాస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్‌ డబ్బీర్‌ భవానీశంకర్‌, కౌన్సిలర్లు దుర్గాశంకర్‌ పండా, బెల్లాల శ్రీనివాసరావు, కమిషనర్‌ టి.నాగేంద్ర కుమార్‌, టిపిఒ సీతారాం పాల్గొన్నారు.
మండలంలోని కేదారిపురం సచివాలయం నిర్వహించిన జగనన్న సురక్షలో ఎంపిడిఒ ఎన్‌.రమేష్‌నాయుడు, డిటి లక్ష్మీనారాయణ, పంచాయతీ విస్తరణాధికారి మెట్ట వైకుంఠరావు, సర్పంచ్‌ బోడసింగి ధనుంజయ లబ్ధిదారులకు ధ్రువపత్రాలను అందజేశారు.
ఇచ్ఛాపురం : మున్సిపాలిటీలోని గొల్లవీధి మండం వద్ద నిర్వహించిన జనగన్న సురక్షలో చైర్‌పర్సన్‌ పి.రాజ్యలక్ష్మి, వైస్‌ చైర్‌పర్సన్లు లాభాల స్వర్ణమని, ఉలలా భారతీదివ్య పాల్గొని 11 రకాల ధ్రువపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో కాళ్ల జయదేవ్‌, కాల్ల దిలీప్‌, శాలిన గాంధీ, ప్రకాశరావుపట్నాక్‌, బుచ్చ జగన్‌ పాల్గొన్నారు.
నందిగాం : సంక్షేమ పథకాలపై గ్రామాల్లో తప్పుడు ప్రచారం నిర్వహిస్తున్న ప్రతిపక్ష నాయకులను వైసిపి నాయకులు నిలదీయాలని కళింగ కార్పొరేషన్‌ చైర్మన్‌ పేరాడ తిలక్‌ పిలుపునిచ్చారు. మండలంలోని బెజ్జిపల్లిలో నిర్వహించిన జగనన్న సురక్షలో పాల్గొని 11 రకాల ధ్రువపత్రాలను అందజేశారు. ఎంపిపి నడుపూరు శ్రీరామ్మూర్తి, సర్పంచ్‌ తమిరి రాజు, ఎంపిటిసి బర్నాన బాలకృష్ణ, దిమిలాడ పిఎసిఎస్‌ అధ్యక్షులు బాలక మధుసూదనరావు, జెడ్‌పిటిసి మాజీ సభ్యులు మాదిన గోపాలకృష్ణ, సర్పంచ్‌ ప్రతినిధి కూను సత్యం, తహశీల్దార్‌ వై.పద్మావతి, ఇఒపిఆర్‌డి రాజారావు, దీనబందిపురం సర్పంచ్‌ మడపాల సంజీవరావు పాల్గొన్నారు.
జలుమూరు: మండలంలోని గొటివాడ, అక్కురాడ సచివాలయాల్లో నిర్వహించిన జగనన్న సురక్షలో వైసిపి రాష్ట్ర సిఇసి సభ్యులు ధర్మాన పద్మప్రియ పాల్గొని 11 రకాల ధ్రువపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో వైసిపి సమన్వయకర్త కనుసు సీతారాం, వైస్‌ ఎంపిపి తంగి మురళీకృష్ణ, జెసిఎస్‌ కన్వీనర్‌ ధర్మాన జగన్మోహనరావు, తహశీల్దార్‌ బి.సత్యం, ఎంపిడిఒ ఎల్‌.వి.అప్పారావు పాల్గొన్నారు.
పొందూరు: మండలంలోని రాపాకలో నిర్వహించిన జనగన్న సురక్షలో ఎంపిపి కిల్లి ఉషారాణి, జెడ్‌పిటిసి లోలుగు కాంతారావులు పాల్గొని 11 రకాల ధ్రువపత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ ప్రతినిధి కొంచాడ గిరిబాబు, ఎంపిడిఒ సీపాన హరిహరరావు, పిఎసి ఎస్‌ అధ్యక్షులు కొంచాడ రమణమూర్తి, వైసిపి మండల అధ్య క్షులు పప్పల రమేష్‌కుమార్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బాడాన సునీల్‌ కుమార్‌, ఎంపిటిసి చింత రమణమ్మ పాల్గొన్నారు.
సంతబొమ్మాళి : మండలంలోని పాలతలగాంలో నిర్వహించిన జనగన్న సురక్షలో సర్పంచ్‌ అప్పన్న పాల్గొని 11 రకాల ధ్రువపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఎంపిటిసి ప్రతినిధి అట్టాడ అప్పలనాయుడు, ఎంపిడిఒ ప్రేమలీల, వైస్‌ ఎంపిపి ప్రతినిధి నక్క భీమారావు, డిటి వి.ప్రవీణ్‌కుమార్‌, మహిళా సమాఖ్య అధ్యక్షులు చింతాడ రమణమ్మ, నక్కిట్ల నరేష్‌ పాల్గొన్నారు.
నరసన్నపేట : స్థానిక నాలుగో సచివాలయం వద్ద నిర్వహించిన జనన్న సురక్షలో పోలాకి జెడ్‌పిటిసి ధర్మాన కృష్ణచైతన్య పాల్గొని లబ్ధిదారులకు వివిధ రకాల ధ్రువపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఎంపిపి ఆరంగి మరళి, జెడ్‌పిటిసి చింతు పార్వతి, రామారావు, సర్పంచ్‌ బి.శంకర్‌, రాజాపు అప్పన్న, సురంగి నరసింగరావు పాల్గొన్నారు.
మెళియాపుట్టి : మండలంలోని మరిప్రాడులో నిర్వహించిన జగనన్న సురక్షలో తహశీల్దార్‌ పి.సరోజని పాల్గొని వివిధ రకాల ధ్రువపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో జెడ్‌పిటిసి గూడ ఎండయ్య, ఎంపిపి ప్రతినిధి బి.ఉదరు, ఇఒపిఆర్‌డి తారకేశరి, ఎపిఒ రవి, ఎపిఎం లలిత పాల్గొన్నారు.