
ప్రజాశక్తి-నర్సీపట్నంటౌన్:మున్సిపాలిటీ పరిధిలో 28వ వార్డు అయ్యన్న కాలనీలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ పరిధిలో 28వ వార్డులో వైఎస్‌ఆర్సిపి నాయకురాలు గంటా లలిత ఆధ్వర్యంలో వార్డు వాలంటీర్లు ఇంటింటా సర్వే చేపట్టారు. ఈ సందర్భంగా లలిత మాట్లాడుతూ, ఈనెల 24వ తేదీ నుండి వచ్చే జులై నెల 24వ తేదీ వరకు నెల రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ పథకం ద్వారా 11 రకాల సమస్యలు ఉచితంగా పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రం, కొత్త రేషన్ కార్డు, ఆధార్ కార్డులో మార్పులు చేర్పులు, హౌసింగ్‌లో సమస్యలు, రేషన్ కార్డులో మార్పులు చేర్పులు వంటి 11 రకాల సమస్యలను ఇంటి వద్దకే వాలంటీర్ ద్వారా తక్షణమే పరిష్కరిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో వార్డు వాలంటీర్లు పాల్గొన్నారు.