Jun 27,2023 21:03

మాట్లాడుతున్న వైసిపి నాయకులు

మాట్లాడుతున్న వైసిపి నాయకులు
'జగనన్న సురక్ష'తో సమస్య పరిష్కారం
బుచ్చిరెడ్డిపాలెం:నగరంలో సచివాలయం -5పరిధిలో 13 వార్డులో శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి ఆదేశాల మేరకు కౌన్సిలర్‌ పుట్టా లక్ష్మీకాంతమ్మ ఆధ్వర్యంలో వలంటీర్లు, గహ కన్వీనర్‌లతో కలిసి ఇంటింట జగనన్న సురక్ష కార్యక్రమంపై అవగాహన క్యాంపస్‌ నిర్వహించారు.ఈ క్యాంపెయిన్‌ లో ముఖ్య అతిథులుగా వైసిపి నాయకులు జొన్నవాడ దేవస్థానం చైర్మన్‌ పుట్టా లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు, కమిషనర్‌ చంద్రశేఖర్‌ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా పుట్టా లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రజల కోసం ఇప్పటికే వివిధ రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజా సంక్షేమానికి పాటుపడు తుందన్నారు.అందులో భాగంగా జూన్‌ 23
నుంచి జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి కొనసాగింపుగా జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించబడుతుందని తెలియజేశారు. అనంతరం కౌన్సిలర్‌ లక్ష్మీ కాంతమ్మ మాట్లాడుతూ ఈ నెల 23 నుంచి జూలై 23 వరకూ నెలరోజుల పాటు జగనన్న సురక్ష కార్యక్రమం ఉంటుందన్నారు. ఇందులో భాగంగా ప్రజలకు సంబంధించిన పత్రాలు, సర్టిఫికెట్లు, ప్రభుత్వ పథకాల సమస్యలుంటే వెంటనే పరిష్కరిస్తారని తెలిపారు. ఈ పనుల నిర్వహణ కోసం మండలాధికారులు స్థానికంగా ఎక్కడికక్కడ క్యాంపులు నిర్వహించి సమస్యలకు పరిష్కారం చూపుతారన్నారు.13 వార్డు పరిదిలో సచివాలయం-5 లో జులై 04 తేదీన క్యాంపు నిర్వహించబడుతుందని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.అనంతరం కమిషనర్‌ చంద్రశేఖర్‌ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సామాన్యుడి ముఖంలో చిరునవ్వు చూడటమే ఈ కార్యక్రమం ఉద్దేశమన్నారు. ఎవరి సమస్యైనా తిరస్కరించబడితే ఎందుకు తిరస్కరించారనేది ఆ ఫిర్యాదుదారుడి ఇంటికెళ్లి వివరిస్తామన్నారు. అప్పటి వరకూ పరిశీలనకు నోచుకోని సమస్యలు ఏవైనా ఉంటే నసంబందిత అధికారుల దష్టికి తీసుకువెళ్లి 24 గంటల్లోగా పరిష్కారం చూపుతామన్నారు. అర్హత ఉండీ ప్రభుత్వ పథకాలు అందనివారిని గుర్తించి తక్షణం వారికి ఆ పధకాల లబ్ది పొందేలా చేస్తామన్నారు. జగనన్న సురక్షలో వివిధ పథకాల కింద అర్హులుగా గుర్తించినవారికి ఆగస్టు 1వ తేదీన అర్హత పత్రాలు వలీంటర్ల ద్వారా నేరుగా వారి గడప వద్దకే అందజేస్తామన్నారు.కార్యక్రమంలో 13వ వార్డు కన్వీనర్‌ పి.రాజ్‌ కుమార్‌, ఐదవ సచివాలయం వాలంటీర్స్‌, గహసారథులు తదితరులు పాల్గొన్నారు.