Jul 22,2023 23:32

ఆమదాలవలస : ధ్రువపత్రాన్ని అందజేస్తున్న స్పీకర్‌ సీతారాం

ప్రజాశక్తి- ఆమదాలవలస: జగనన్న సురక్ష కార్యక్రమంతో ప్రజలకు సేవలు సరళతరం కానున్నాయని శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. మండలంలోని కనుగులవలసలో శనివారం నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 1902 జగనన్నకు చెబుదాం కార్యక్రమం సత్ఫలితాలను ఇచ్చిందని అన్నారు. దానికి అనుసంధానమే జగనన్న సురక్ష అని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజులపాటు జగనన్న సురక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎటువంటి ఫీజు వసూలు చేయకుండా 11 రకాల ధ్రువపత్రాలను ప్రజలకు ఉచితంగా అందిస్తున్నామని అన్నారు. సంక్షేమ పథకాలతో సిఎం జగన్‌ ప్రజల మనసులలో చెరగని ముద్ర వేసుకున్నారని అన్నారు. అనంతరం ధ్రువపత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో తహశీల్దార్‌ ఎస్‌.గణపతి, ఎంపిడిఒ ఎస్‌.వాసుదేవరావు, ఎంపిపి ప్రతినిధి తమ్మినేని శ్రీరామ్మూర్తి, పిఎసిఎస్‌ అధ్యక్షుడు గురుగుబిల్లి శ్రీనివాసరావు, డిసిసిబి డైరెక్టర్‌ బొడ్డేపల్లి నారాయణరావు, సచివాలయాల కో-ఆర్డినేటర్‌ నిరంజన్‌ బాబు, ఎంపిటిసి పొన్నాడ అనసూయమ్మ పాల్గొన్నారు.
ఇచ్ఛాపురం : జగనన్న సురక్షతో ప్రజా సమస్యలు పరిష్కారముతాయని జెడ్‌పి చైర్‌పర్సన్‌ పిరియా విజయ, ఎమ్మెల్సీ నర్తు రామారావు అన్నారు. మండలంలోని లొద్దపుట్టి సచివాలయంలో నిర్వహించిన జనగన్న సురక్షలో పాల్గొని 11 రకాల ధ్రువపత్రాలను అందజేశారు. సీడాప్‌ చైర్మన్‌ శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, ఎంపిపి బోర పుష్ప, మండల జెసిఎస్‌ అధ్యక్షులు ఆసి పురుషోత్తం, సర్పంచ్‌ ఆశి సులోచనరెడ్డి, కారంగి మోహనరావు, ఆశి దాలయ్య రెడ్డి, తహశీల్దార్‌ గురుప్రసాద్‌ పాల్గొన్నారు.
నరసన్నపేట : మండలంలోని మాకివలస పంచాయతీలో నిర్వహించిన జగనన్న సురక్షలో ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌ పాల్గొని వివిధ రకాల ధ్రువపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
కొత్తూరు : మండలంలోని మెట్టూరు బిట్‌-2, మాతల సచివాలయంలో నిర్వహించిన జనగన్న సురక్షలో ఎమ్మెల్యే రెడ్డి శాంతి 11 రకాల ధ్రువపత్రాలను అందజేశారు. జెడ్‌పిటిసి కె.భాగ్యవతి, ఎంపిడిఒ ఎం.పావని, పిఎసిఎస్‌ అధ్యక్షులు చింతాడ సూర్యనారాయణ, వైసిపి మండల కన్వీనర్‌ సారిపల్లి ప్రసాదరావు, సర్పంచ్‌లు వై.ధర్మారావు, కుంచాల రత్నాలు, నాస బాలకృష్ణ, వైకుంఠరావు, జి.ఆనంద రావు, బి.శ్రీను, కె.త్రినాథవరావు, దూళి అప్పన్న పాల్గొన్నారు.
మెళియాపుట్టి : మండలంలోని వెంకటాపురం సచివాలయం, బందపల్లిలో నిర్వహించిన జగనన్న సురక్షలో ఎమ్మెల్యే రెడ్డి శాంతి పాల్గొని వివిధ రకాల ధ్రువప్రతాలను అందజేశారు. కార్యక్రమంలో జెడ్‌పిటిసి గూడ ఎండయ్య ఎంపిపి ప్రతినిధి బి.ఉదరు కుమార్‌, పిఎసిఎస్‌ అధ్యక్షులు బాలరాజు, వైసిపి మండల కన్వీనర్‌ పల్లి యోగి, తహశీల్దార్‌ పి.సరోజని, ఇఒపిఆర్‌డి తారకేశ్వరి, మండల ఎఒ దాణకర్ణుడు, ఎపిఎం లలిత, సర్పంచ్‌లు బి.జయమ్మ, గూడ వసంతకుమారి పాల్గొన్నారు.
సంతబొమ్మాళి : మండలంలోని మేఘవరం, అక్కివలస సచివాలయాల వద్ద నిర్వహించిన జనగన్న సురక్షలో కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి 11 రకాల ధ్రువపత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌, జెడ్‌పిటిసి పాల వసంతరెడ్డి, వైస్‌ ఎంపిపి ప్రతినిధి నక్క భీమారావు, మండల వైసిపి కన్వీనర్‌ కోత సతీష్‌, సర్పంచ్‌లు పరపటి సునీతారెడ్డి, శ్రీరంగం వీరాస్వామి, ఎంపిటిసిలు సూరాడ రాజారావు, బొంగు కొండయ్య, మరువాడ వైసిపి ఇన్‌ఛార్జి గంట ఈశ్వరరావు, కార్యదర్శులు కె.విద్య, శ్రీనివాసరావు పాల్గొన్నారు.
కోటబొమ్మాళి: మండలంలోని నీలంపేట సచివాలయం వద్ద సర్పంచ్‌లు మెట్ట ఈశ్వరమ్మ, మెట్ట సింహాచలం, లలితాంబ, బొడ్డు లక్ష్మి ఆధ్వర్యాన నిర్వహించిన జనగన్న సురక్షలో ఎంపిపి రోణంకి ఉమామల్లేశ్వరరావు, జెడ్‌పిటిసి దుబ్బ వెంకటరావులు పాల్గొని వివిధ రకాల ధ్రువపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఎంపిడిఒ కె.ఫణీంద్రకుమార్‌, కళింగ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ సంపతిరావు హేమసుందరరాజు, పేడాడ వెంకటరావు, మండల ప్రత్యేకాధికారి లోకనాథం, డిటి, ఆర్‌.మధు, ఇఒపిఆర్‌డి చైతన్య, హౌసింగ్‌ ఎఇ రెడ్డి పాపినాయుడు, మెట్టు వాసు పాల్గొన్నారు.
కవిటి : మండలంలోని కపాసుకుద్దిలో సర్పంచ్‌ కాయ దమయంతి అధ్యక్షతన నిర్వహించిన జనగన్న సురక్షలో జెడ్‌పి చైర్‌పర్సన్‌ పిరియా విజయ, ఎమ్మెల్సీ నర్తు రామారావు పాల్గొని వివిధ రకాల ధ్రువపత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో ఎంపిపి ప్రతినిధి కడియాల ప్రకాష్‌, ఎఎంసి వైస్‌ చైర్మన్‌ యలమంచి నీలయ్య, టెందాళం జయప్రకాష్‌, పులకల శ్రీరాములు, కాయ భీమసేన్‌, పూడి నీలాచలం, డిటి రామచంద్రరావు పాల్గొన్నారు.
రణస్థలం: మండలంలోని పైడిభీమవరం-1 సచివాలయ పరిధిలో నిర్వహించిన జగనన్న సురక్షలో ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌ పాల్గొని 11 రకాల ధ్రువపత్రాలను అందజేశా రు. మండల ప్రత్యేక అధికారి డాక్టర్‌ దుర్గారావు, తహశీల్దార్‌ ఎస్‌.కిరణ్‌కుమార్‌, ఎంపిడిఒ రమణమూర్తి, మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
పలాస : మున్సిపాలిటీ పరిధిలోని న్యూ కాలనీ, సీతానగర్‌లో నిర్వహించిన జనగన్న సురక్షలో చైర్మన్‌ బల్ల హరిబాబు పాల్గొని 11 రకాల ధ్రువపత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ బోర కృష్ణారావు, విప్‌ దుర్గా శంకర్‌పండా, పలాస ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్‌ డబ్బీర్‌ భవానీశంకర్‌, కౌన్సిలర్‌ ప్రసాద్‌, వాణిజ్య విభాగ అధ్యక్షులు బెల్లాల శ్రీనివాసరావు, సనపల సింహాచలం, కమిషనర్‌ టి.నాగేంద్రకుమార్‌ పాల్గొన్నారు.
టెక్కలి రూరల్‌ : టెక్కలి 3,4 సచివాలయాల్లో నిర్వహించిన జనగన్న సురక్షలో నియోజకవర్గ ఇన్‌ఛార్జి దువ్వాడ వాణి పాల్గొని ధ్రువపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో డిటి.ఎస్‌.రవికుమార్‌, సర్పంచ్‌ గొండెలి సుజాత, కార్యదర్శి కూన వినోద్‌ కుమార్‌పాల్గొన్నారు.
జి.సిగడాం : మండలంలోని వెలగాడ, నిద్దాం గ్రామాల్లో నిర్వహించిన జగనన్న సురక్షలో మండల ప్రత్యేక ఆహ్వానితులు మీసాల వెంకటరమణ, జెడ్‌పిటిసి కాయల రమణ పాల్గొని ధ్రువపత్రాలను అందజేశారు. సర్పంచ్‌ భూపతి సురేష్‌, బొల్ల జనార్థనరావు, ఎంపిడిఒ కె.నిశ్చెల, తహశీల్దార్‌ పప్పల వేణుగోపాలరావు పాల్గొన్నారు.
జలుమూరు: మండలంలోని మర్రివలస, నగిరికటకం సచివాలయాల్లో నిర్వహించిన జగనన్న సురక్షలో పోలాకి జెడ్‌పిటిసి ధర్మాన కృష్ణచైతన్య, ఎంపిపి వాన గోపి పాల్గొని ధ్రువపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపిపి తంగి మురళీకృష్ణ, మండల వైసిపి కన్వీనర్‌ కనుసు సీతారాం, మండల సలహాదారుడు విఠల్‌రావు, బి.లక్ష్మణరావు, తహశీ ల్దార్‌ బి.సత్యం, ఎంపిడిఒ ఎల్‌.వి.అప్పారావు పాల్గొన్నారు.