Jul 18,2023 21:41

ధ్రువ పత్రాలను పంపిణీ చేస్తున్న డిప్యూటీ సిఎం రాజన్నదొర

ప్రజాశక్తి - పాచిపెంట : ప్రజల కష్టాలను తెలుసుకొని, వారికి కావాల్సిన ధ్రువపత్రాలు ఉచితంగా అందించడమే కాకుండా అర్హత కలిగిన ప్రతి ఒకర్ని గుర్తించి సంక్షేమ పథకాలు అందించడమే జగనన్న సురక్ష కార్యక్రమం ముఖ్యోద్దేశమని డిప్యూటీ సిఎం పి.రాజన్నదొర తెలిపారు. మంగళవారం స్థానిక మినీ గురుకులం ఆవరణలో ఏర్పాటు చేసిన జగనన్న సురక్ష కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల, మత, పార్టీలకు అతీతంగా ప్రజలకు మేలు చేసేందుకు, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే జగనన్న సురక్ష కార్యక్రమం ముఖ్యోయద్దేశమన్నారు. జగనన్న సురక్ష ప్రజలకు ఒక వరం అని అర్హత ఉండి పథకాలు పొందలేని వారికి ఒక అవకాశంగా నిలుస్తుందన్నారు. అనంతరం లబ్ధిదారులకు ధ్రువపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి డోల బాబ్జీ, నాయకులు టి.గౌరీశ్వరరావు, దండి ఏడుకొండలు, ఇజ్జాడ అప్పలనాయుడు, వైస్‌ ఎంపిపి మీసాల నారాయణ, ఎంపిడిఒ జి.పార్వతి, తహశీల్దార్‌ రాజశేఖర్‌, పలువురు నాయకులు, అధికారులు పాల్గొన్నారు
పిల్లలు ఆరోగ్యంపై దృష్టి పెట్టండి
జగనన్న సురక్ష కార్యక్రమంలో అనంతరం రాజన్నదొర మినీ గురుకులాన్ని డిప్యూటీ సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థినీలతో మమేకమయ్యారు. ముఖ్యంగా చదువుపై దృష్టి సారించాలని సూచించారు పిల్లలు ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని ఆకాంక్షించారు. సమస్యలను నివారణకు విద్యే ప్రధానమైందన్నారు. విద్యార్థుల ఆరోగ్యంపై జాగ్రత్తలు పాటించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు.
భామిని : మండలంలోని పెద్దదిమిలి, బూరుజోల సచివాలయం ఆవరణలో జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపిపి ప్రతినిధి తోట సింహాచలం సచివాలయం ద్వారా ఉచితంగా మంజూరు చేసే ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపిపి బోనగడ్డి ధర్మారావు, తహశీల్దార్‌ అప్పారావు, ఎంపిడిఒ చంద్రరావు, సర్పంచులు తోఘరానా శ్రీను, పాశర్ల రామారావు, మడపానా కేశవ, బెవర భార్గవనాయుడు, సచివాలయం సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.
వీరఘట్టం : మండలం తెట్టంగిలో ఏర్పాటు చేసిన జగనన్న సురక్ష కార్యక్రమంలో పాలకొండ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఉపాధ్యక్షులు పి.లక్ష్మణరావు పాల్గొన్నారు. అలాగే నడిమికెళ్లలో సర్పంచ్‌ డి.సుజాత ఆధ్వర్యంలో జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. అనంతరం లబ్ధిదారులకు ధ్రువపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల్లో సర్పంచ్‌ అలజంగి విజయమ్మ, పి.పరిశినాయుడు, సతివాడ చిన్నంనాయుడు, తహసిల్దార్‌ సిహెచ్‌ సత్యనారాయణ, ఎంపిడిఒ జి.జయంతిప్రసాద్‌, సచివాలయ కార్యదర్శులు ఎన్‌.కోటి, బంగారు బాబు, సచివాలయ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.
సీతంపేట : మండల కేంద్రమైన సీతంపేటలో ఎంపిపి బి.ఆదినారాయణ ఆధ్వర్యంలో స్థానిక సామాజిక భవనంలో జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 207మంది లబ్ధిదారులకు ధ్రువపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఎఎంసి చైర్మన్‌ మోహన్‌ రావు, సర్పంచ్‌ కళావతి, వైస్‌ ఎంపిపి కె.సరస్వతి, ఎంపిటిసి పగడాలమ్మ, కార్యదర్శి బి.సుదర్శనరావు, విఆర్‌ఒలు సుబ్బారావు, వైసిపి నాయకులు పాలవలస ప్రకాశరావు, వార్డుసభ్యులు పాల్గొన్నారు.
సాలూరు: పట్టణంలోని రామా కాలనీలో నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో డిప్యూటీ సిఎం రాజన్నదొర అర్హులైన వారికి ధ్రువపత్రాలు పంపిణీ చేశారు. జెసిఎస్‌ కన్వీనర్‌ గిరి రఘు ఆధ్వర్యాన నిర్వహించిన కార్యక్రమంలో రాజన్నదొర మాట్లాడుతూ ఇంకా సంక్షేమ పథకాలు అందని పేదలు స్థానిక నాయకులు, కౌన్సిలర్‌ను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు తాడి రమణ, మేకల శంకరరావు, పున్నాన మోహన్‌ రావు పాల్గొన్నారు.
బలిజిపేట : మండలంలోని వెంగాపురం, తుమరాడలో జగనన్న సురక్ష కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే అలజంగి జోగారావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా అధికారులు జారీ చేసిన 11రకాల ధ్రువపత్రాలను లబ్దిదారులకు అందజేశారు. కార్యక్రమంలో ఎంపిపి గుడివాడ నాగమణి, వైస్‌ ఎంపిపిలు వెలిది సుబ్బారావు, జెడ్పీటీసీ సభ్యులు అలజంగి రవికుమార్‌, మండల పార్టీ అధ్యక్షులు పి.మురళీకృష్ణ, స్థానిక సర్పంచ్‌ జి. అమ్మడమ్మ, కిల్లాడ కనకమహాలక్ష్మి, ఎంపిటిసి సభ్యులు గులిపిల్లి మురళీ, తహశీల్దార్‌ అప్పలరాజు, ఎంపిడిఒ విజయలక్ష్మి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు, వైసిపి సీనియర్‌నాయకులు, కార్యకర్తలు, సచివాలయం ఉద్యోగులు, వాలంటీర్లు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, స్థానిక ప్రజలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.