లబ్ధిపత్రాలను అందజేస్తున్న నాయకులు
ప్రజాశక్తి - మంత్రాలయం
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన 'జగనన్న సురక్ష'తో ప్రజలకు ఎంతో మేలు జరుగుతోందని వైసిపి మండల అధ్యక్షులు భీమిరెడ్డి, ఇన్‌ఛార్జీ విశ్వనాథ్ రెడ్డి తెలిపారు. శుక్రవారం మండలంలోని వి.తిమ్మాపురం, వగరూరు గ్రామాల్లో ఎంపిడిఒ మణిమంజరి ఆధ్వర్యంలో 'జగనన్న సురక్ష' నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. 'జగనన్న సురక్ష' ద్వారా ప్రజా సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు. ఇప్పటికే ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు. అనంతరం లబ్ధిదారులకు ధ్రువపత్రాలను అందజేశారు. తహశీల్దార్ చంద్రశేఖర్, ఎస్‌ఐ వేణుగోపాల్ రాజ్ పాల్గొన్నారు.










