Jul 21,2023 21:50

ధ్రువపత్రాలను అందజేస్తున్న ఆర్డీవో

ప్రజాశక్తి - పుట్టపర్తి రూరల్‌ : ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ప్రజలందరికీ లబ్ధి చేకూరుతుందని ఆర్డీవో భాగ్యరేఖ పేర్కొన్నారు. శుక్రవారం సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి వద్ద ప్రశాంతి గ్రామంలో ఏర్పాటు చేసిన జగనన్న సురక్ష కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడం కోసం ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని దీనినీ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్‌ నవీన్‌ కుమార్‌, మున్సిపల్‌ చైర్మన్‌ ఓబుళపతి, కమిషనర్‌ మధుసూదన్‌ రెడ్డి, వైసీపీ మండల కన్వీనర్‌ రంగారెడ్డి, మున్సిపల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ తిప్పన్న, కౌన్సిలర్లు నారాయణరెడ్డి, రిషికేశవరెడి,్డ ఆరు వార్డుల కౌన్సిలర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.
హిందూపురం : జగనన్న సురక్షతో ప్రజల ఇళ్లవద్దకే ప్రభుత్వ సేవలు అం దుతున్నాయనివైసిపి సమన్వయకర్త దీపిక వేణు రెడ్డి అన్నారు. శుక్రవారం హిందూపురం పురపాలక సంఘంలోని రహమత్‌పురం, తదితర ప్రాంతాల్లో జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో ఆమెతో పాటు మున్సిపల:్‌ వైస్‌ చైర్మేన్‌ బలరామిరెడ్డి, మాజీ ఎమ్మేల్యే అబ్దుల్‌ ఘని పాల్గొన్నారు. ఈ సందర్బంగా దీపిక మాట్లాడుతు పురపాలక సంఘంతో పాటు రూరల్‌ మండల వ్యాప్తంగా కొద్ది రోజుల్లోనే దాదాపు వేలాది మందికి 11 రకాల ధ్రువీకరణ పత్రాలు అందించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ ప్రమోద్‌ కుమార్‌, వార్డు కౌన్సిలర్లు షాజియా, మారుతీ రెడ్డి, శివ, ఆసీఫ్‌వుల్లా, సునీత, మల్లికార్జున, రామచంద్ర తదితరులు పాల్గొన్నారు.
తలుపుల : మండల పరిధిలోని లక్కసముద్రం గ్రామంలో శుక్రవారం నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో కదిరి ఎమ్మెల్యే పివి సిద్ధారెడ్డి పాల్గొన్నారు. స్థానిక సర్పంచి తొలిసమ్మతో కలసి అర్హులకు ధ్రువపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుదర్శన్‌ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, వెంకట రెడ్డి. ఎంపీపీ రఫీ నాయక్‌, డీకే బాబు తదితరులు పాల్గొన్నారు.