Jun 28,2023 23:28

కోటవురట్లలో పరిశీలిస్తున్న ప్రత్యేక అధికారి

ప్రజాశక్తి- సబ్బవరం:జగనన్న సురక్ష కార్యక్రమంపె మండలంలోని మొగలిపురం గ్రామంలో బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సచివాలయం కన్వీనర్‌ యడ్ల నాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపిపి బోకం సూర్యకుమారి మాట్లాడుతూ జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా కుల, ఆదాయ, వివాహ, జనన, మరణ ధ్రువపత్రాలు, ఆధార్‌, రేషన్‌ కార్డులు, భూముల మ్యుటేషన్‌, రిజిస్ట్రేషన్‌ వంటి సేవలు సచివాలయంలోనే ఉచితంగా అందించనున్నట్లు చెప్పారు. మండల జెసిఎస్‌ కన్వీనర్‌ సబ్బవరపు ముత్యాలనాయుడు, జగనన్న సురక్ష ఇన్‌ఛార్జి కోటాన రాము, వైసిపి నాయకులు బోకం రామునాయుడు, వీఆర్వో జ్యోతి, సచివాలయం కన్వీనర్‌లు ఐడి బాబు, గండి మహాలక్ష్మి, పైల రామునాయుడు, బత్తిన వెంకట్‌, జెట్టి హేమంత్‌ తదితరులు పాల్గొన్నారు.
అనకాపల్లి : మండలంలోని గోపాలపురం గ్రామ సచివాలయంలో జగనన్న సురక్ష పథకం మీద బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఎంపిపి గొర్లి సూరిబాబు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ జెర్రిపోతుల లక్ష్మి, ఎంపీడీవో కేవీ నరసింహరావు, ఈవోపీఆర్డి కే ధర్మారావు, మార్టూరు సర్పంచ్‌ రెవెన్యూ నాయుడు, అధికారులు పాల్గొన్నారు.
మునగపాకరూరల్‌:మండలంలోని శిరసపల్లి గ్రామ సచివాలయంలో బుధవారం జగనన్న సురక్షపై వాలంటీర్లు, గృహసారథులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శిరసపల్లి సర్పంచ్‌ మద్దాల ధనలక్ష్మి, ఎంఎల్‌ఓ సంజరు కుమార్‌, ఎంపీటీసీ మద్దాల వీరు నాయుడు, బొడ్డేడ జగ్గారావు, గృహ సారధులు పాల్గొన్నారు.
కోటవురట్ల:ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జగనన్న సురక్ష పధకం దరఖాస్తులు పట్ల నిర్లక్ష్యం చేయరాదని మండల ప్రత్యేక అధికారి ఉదయశ్రీ అన్నారు. బుధవారం రాజపేటలో నిర్వహిస్తున్న జగనన్న సురక్ష పథకం పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మండలంలో చేపడుతున్న కోటవురట్ల రెండు సచివాలయాలు, చౌడవాడ, రాజుపేట సచివాలయాల పరిధిలో 282 దరఖాస్తులు వచ్చినట్లు ఆమె తెలిపారు. వీటిలో 194 దరఖాస్తులు సంబంధిత అధికారులు పరిశీలనకు పంపించినట్లు పేర్కొన్నారు. కోటవురట్లలో 188, కోటవురట్ల 2లో 85, చౌడువాడ 126, రాజుపేట 95, వివిధ ధ్రువ పత్రాలకు దరఖాస్తు చేసుకున్నట్లు ఆమె తెలిపారు. వీరికి సమగ్ర విచారణ అనంతరం వచ్చే నెల ఒకటి, మూడు తేదీల్లో జగనన్న సురక్ష ధ్రువ పత్రాలు అందజేస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కాశీ విశ్వనాథరావు, పిఓపిఆర్డి సుబ్రహ్మణ్యం, పాల్గొన్నారు.