ప్రజాశక్తి - వీరఘట్టం : గ్రామాల్లో నిర్వహిస్తున్న జగనన్న సురక్షతో ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ అన్నారు. మండలంలోని నీలానగరంలో జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పాలకొండ వైస్ ఎంపిపి కణపాక సూర్య ప్రకాష్, సర్పంచ్ వావలపల్లి పురుషోత్తమరావు, బెవర అప్పలనాయుడు, మంగిపూడి రాంబాబు, వావలపల్లి పకీరునాయుడు, బొత్స సన్యాసి నాయుడు, మజ్జి తవిటి నాయుడు, రెవెన్యూ అధికారులు, మండల పరిషత్ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా 295 మంది లబ్ధిదారులకు సర్టిఫికెట్లను అందజేశారు. అలాగే పనస నందివాడలో మండల ప్రత్యేక అధికారి పి.కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు వావిలపల్లి పురుషోత్తమ నాయుడు, బొమ్మల సరోజినీ, కె.సన్యాసినాయుడు, తహశీల్దార్ సిహెచ్ సత్యనారాయణ, ఎంపిడిఒ జయంతిప్రసాద్, ఆర్‌ఐ ఎస్.మారుతీరావు, ఎంపీటీసీ బొమ్మల సూర్య ప్రకాష్, సచివాలయ కార్యదర్శిలు గ్రామస్తులు పాల్గొన్నారు.
సీతానగరం : మండలంలోని పెదబోగిలి ఒకటి, రెండు గ్రామ సచివాలయాల్లో శనివారం జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎ.జోగారావు మాట్లాడుతూ జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ప్రజలకు 11 రకాల సేవలను ఉచితంగా అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వచ్చిన సమస్యలను అక్కడే పరిష్కరించే దిశగా కృషి జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఎంపిపి. బిశ్రీరాములు నాయుడు, జెడ్‌పిటిసి సభ్యులు ఎం.బాబ్జీ, ఎంపిటిసి సభ్యులు ఎస్.గౌరి, బురిడి కుసుమ, సర్పంచి జొన్నాడ తేరేజమ్మ, ఎంపిడిఒ ఎంఎస్‌ఎల్‌వి ప్రసాద్, తహశీల్దార్ ఎంవి రమణ, పలువురు వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పార్వతీపురం రూరల్ : అర్హులందరికీ సంక్షేమ పథకాల అందజేయడం ద్వారా సురక్ష కార్యక్రమం ప్రతి కుటుంబానికి రక్షగా మారిందని ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. మండలంలోని నర్సిపురంలో సచివాలయం -1,2 నిర్వహించిన జగనన్న సురక్ష క్యాంప్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఆర్జీదారులకు మంజూరు చేసినటువంటి 11రకాల అధికారిక ధ్రువీకరణ పత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపిపి మజ్జి శోభారాణి, వైస్ ఎంపిపిలు సిద్ధ జగన్నాథరావు, బంకూరు రవికుమార్, జెడ్పీటీసీ ప్రతినిధి బలగ నాగేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు బొమ్మి రమేష్, ఎంపిడిఒ ఎస్.రమేష్, తహశీల్దార్ శివన్నారాయణ, స్థానిక సర్పంచ్ చెరుకుబిల్లి బంగారమ్మ, పిఎసిఎస్ చైర్మన్ కాపారపు సత్యనారాయణ, వైసిపి సీనియర్ నాయకులు వెంపలి గురురాజు, సచివాలయంల ఉద్యోగులు, వాలంటీర్లు, సచివాలయం కన్వీనర్లు, గహ సారథులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
పాచిపెంట : మండలంలోని కేసలిలో శనివారం నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో ఎంపిపి బి.ప్రమీల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో రాజన్న దొరను గెలిపించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని గుర్తు చేశారు. కార్యక్రమంలో వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి డోల బాబ్జీ, సర్పంచ్ ప్రతినిధి, సత్తరపు రాము, కోటికిపెంట సర్పంచ్ ఇజ్జాడ అప్పలనాయుడు, గండిపల్లి రాము, సింహాచలం, ఎంపిడిఒ జి.పార్వతి తదితరులు పాల్గొన్నారు.
సాలూరు రూరల్ : మండలంలోని కందులపదంలో జగనన్న సురక్ష కార్యక్రమం వైస్ ఎంపిపి రెడ్డి సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం నుండి రావాల్సిన ధ్రువపత్రాలు ప్రజంతా ఉపయోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో జెసిఎస్ మండల కన్వీనర్ కల్లేపళ్లి త్రినాథ్‌నాయుడు, ఎంపిడిఒ ఎ.రమాదేవి, వైసిపి నాయకులు దండి శ్రీనివాసరావు, సువ్వాడ రామకృష్ణ, భరత్ శ్రీనివాసరావు, తాడంగి కన్నంనాయుడు గృహ సారథులు, కన్వీనర్లు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.
గుమ్మలక్ష్మీపురం: జియమ్మవలస మండలం పెద్దబుడ్డిడి సర్పంచి శీమల సుజాత ఆధ్వర్యాన జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్హులుగా ఉండి సంక్షేమ పథకాలు అందని వారుంటే వారిని గుర్తించి అందించడం జరుగుతుందని తెలిపారు. కొత్తగా మంజూరైన ధ్రువపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఎంపిటిసి రేవళ్ల జ్యోతి, ఉపసర్పంచి తిరుపతిరావు, ఎంపిడిఒ శ్రీనివాసరావు, వైసిపి నాయకులు శీమల బాబు మోహన్ రావు, శ్రీను తదితరులు ఉన్నారు.
గుమ్మలక్ష్మీపురం : జగనన్న సురక్ష పథకం మండలంలోని ప్రతి ఒక్కరికీ ఉపయోగపడాలని తహశీల్దార్ జె.రాములమ్మ కోరారు. మండలంలోని చినగీశాడ సచివాలయంలో జగనన్న సురక్ష గ్రామసభలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఇఒపిఆర్‌డి జగదీష్‌కుమార్, పంచాయతీరాజ్ శాఖ ఎఇ కె.మురళీధర్‌రావు, హౌసింగ్ ఎఇ రెడ్డి శ్రీనివాసరావు, సచివాలయం ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.










