Jul 29,2023 21:19

సీతానగరం : సభలో మాట్లాడుతున్న జెడ్‌పిటిసి సభ్యులు బాబ్జీ

ప్రజాక్తి-పాలకొండ రూరల్‌ : జగనన్న సురక్ష కార్యక్రమంతో మరోసారి ప్రజల చెంతకే ప్రభుత్వం చేరిందని ఎంఎల్‌సి పాలవలస విక్రాంత్‌ అన్నారు. మండలంలో భాసూరులో జగనన్న సురక్ష కార్యక్రమం శనివారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల వద్దకే సేవలు తీసుకువెళ్లాలనే ఉద్ధేశ్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందన్నారు. దీనివల్ల ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందన్నారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఇళ్ల వద్దకే సర్టిఫికెట్లు జారీ చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో స్పెషల్‌ ఆఫీసర్‌ ప్రభాకరరావు, ఎంపిడిఒ ఉమామహేశ్వరి, డిప్యూటీ తహశీల్దార్‌ బుచ్చియ్య, సర్పంచ్‌ శిర్లాపు మల్లేశ్వరమ్మ, అల్లెన పకీరునాయుడు, పాలవలస ధవళేశ్వరరావు, గురివినాయుడు తదితరులున్నారు.
పార్వతీపురం రూరల్‌ :మండలంలోని ఎమ్మార్‌ నగరం, డిములగ సచివాలయాలలో జరిగిన సురక్ష కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు పాల్గొని దరఖాసుదారులకు ధ్రువపత్రాలు పంపిణీ చేశారు. తొలుత లక్ష్మీనారాయణపురం చేరుకుని ఆ సచివాలయం వద్ద జరుగుతున్న జగనన్న సురక్ష కార్యక్రమంలో ప్రభుత్వం మంజూరు చేసిన 11 రకాల అత్యవసరమైన దవీకరణ పత్రాలను లబ్ధిదారులకు ఎమ్మెల్యే పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పరిష్కారం కాకుండా ఇంకా ఏమైనా సమస్యలు మిగిలి ఉన్నాయంటే అక్కడికి విచ్చేసిన ప్రజలను ప్రత్యేకంగా అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచులు వంగపండు లక్ష్మి, మడక కష్ణవేణి, మండల పార్టీ అధ్యక్షులు బొమ్మి రమేష్‌, వైస్‌ ఎంపిపిలు సిద్ధ జగన్నాధరావు, బంకురు రవి కుమార్‌, మజ్జి శేఖర్‌, స్థానిక సర్పంచులు, తహశీల్దార్‌ శివన్నారాయణ, ఎంపిడిఓ ఎస్‌ రమేష్‌, ఆత్మ చైర్మన్‌ ఎండ్రాపు తిరుపతిరావు, వైసిపి సీనియర్‌ నాయకులు వంగపండు త్రినాధ, విశ్వనాథం,బలగ నాగేశ్వరరావు, వేంపలి గురురాజు, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, కార్యకర్తలు, సచివాలయం ఉద్యోగులు, వాలంటీర్లు, గహ సారథులు, స్థానిక ప్రజలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
సీతానగరం : మండలంలోని తామరకండి, సూరంపేట గ్రామ సచివాలయాల్లో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పిటిసి ఎం.బాబ్జి దరఖాస్తుదారులకు ధ్రువపత్రాలు అందజేశారు. ఎంఎస్‌ఎల్‌ఎన్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో వచ్చే సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్‌ ఎల్‌వి రమణ, ఇఒపిఆర్‌డి కెకె వర్మ, ఎపిఎం ఆర్‌.శ్రీరాములు, హౌసింగ్‌ ఎఇ జానకీరామ్‌, వైసీపీ నాయకులు బి.చిట్టి రాజు ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు, వాలంటీర్లు పాల్గొన్నారు.
కొమరాడ : మండలంలోని విక్రంపురంలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలో దరఖాస్తు చేసుకున్న 53 మంది ప్రజలకు రైస్‌ కార్డులు పంపిణీ చేశారు. మరో బృందం ఎంపిడిఒ మల్లికార్జున ఆధ్వర్యంలో కంబవలసలో జగనన్న సురక్ష కార్యక్రమం అధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు గ్రామంలో ఇప్పటికే సర్వే చేసిన నివేదికల ప్రకారం ప్రజలకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలను ప్రజలకు అందజేశారు. అనంతరం గ్రామంలోని పలు వీధుల్లో సందర్శించి ప్రజల సమస్యలను అధికారులు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పంచాయతీ విస్తరణ అధికారి రాధాకష్ణ, వివిధ మండల స్థాయి అధికారులు, నాయకులు కె మల్లిబాబు వైస్‌ ఎంపీపీ శరత్‌ బాబు, వైసీపీ కన్వీనర్‌ జనార్దన్‌ నాయుడు, సర్పంచి ఉప సర్పంచ్లు ప్రజలు నాయకులు వాలంటీర్లు సచివాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.