ప్రజాశక్తి-బల్లికురవ రూరల్: జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా సమస్యలన్నిటికీ త్వరితగతిన పరిష్కారం లభిస్తుందని శాప్ నెట్ చైర్మన్, వైసిపి అద్దంకి నియోజకవర్గ ఇన్‌ఛార్జి బాచిన కృష్ణ చైతన్య అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని ఉప్పుమాగులూరు కొప్పెరపాడు గ్రామంలో జగనన్న సురక్ష కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చైతన్య పలువురికి ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా చైతన్య మాట్లాడు తూ సాంకేతిక కారణాల వల్ల చిన్న చిన్న సమస్యలతో సంక్షే మ పథకాలు అందని వారు జగనన్న సురక్ష పథకం ద్వారా సమస్యలు పరిష్కరించుకొని అవసరమైన ధ్రువీకరణ పత్రా లు పొందవచ్చని అన్నారు. పార్టీలకతీతంగా అర్హత ప్రామా ణికంగా తీసుకుని అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించాలనే దృఢ సంకల్పంతో జగనన్న సురక్ష కార్యక్రమా న్ని ప్రవేశపెట్టారన్నారు. గత ప్రభుత్వం హయాంలో సంక్షేమ పథకాల కోసం ప్రజలు నాయకులు, అధికారుల చుట్టూ తిరిగే వారని, కానీ నేడు జగనన్న ప్రభుత్వంలో సంక్షేమ పథ కాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించడం కోసం వాలం టీర్లు, సచివాలయ సిబ్బంది గడప గడపకూ తిరుగుతున్నార న్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చి ప్రజల కోసం పనిచేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి ప్రజలంతా మరొకసారి అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా రైతు అధ్యక్షులు, సంతమాగులూరు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ చింతల పేరయ్య, బాపట్ల పార్లమెంటు యూత్ అధ్యక్షులు కల్లి ఆంజనేయ ప్రసాద్ రెడ్డి, సర్పంచులు బండారు వెంకాయమ్మ గురవయ్య, పసుమర్తి మహాలక్ష్మమ్మ, తహశీల్దారు రవిబాబు, ఎంపీడీవో సిహెచ్ కృష్ణ, పంచాయతీరాజ్ ఏఈ హనుమంతరావు, మండల వ్యవసాయ శాఖ అధికారి ఎస్‌విపి కుమారి, మండల కో ఆప్షన్ సభ్యులు షేక్ శ్రీనువలి, జేసిఎస్ మండల ఇన్‌ఛార్జి టి నరేష్, పంచాయతీ కార్యదర్శులు అనిల్, వీఆర్వో శ్రీనివాసరావు, సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
అద్దంకి: ప్రభుత్వ చారిత్రాత్మక నిర్ణయం అయిన జగనన్న సురక్ష ప్రజలకు సాయం చేయడానికి ప్రతి గడపకూ చేరు కోవడం ద్వారా పాలనలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతోందని శాప్ నెట్ చైర్మన్ బాచిన కృష్ణ చైతన్య అన్నారు. శుక్రవారం పట్టణంలోని గుంజివారిపాలెం సచివా లయ ప్రజలకు అవసరమైన పథకాలు, సర్టిఫికెట్‌లను స్థానిక పురపాలక సంఘ కార్యాలయం సమావేశంలో బాచిన కృష్ణ చైతన్య అందజేశారు. ఏవైనా సమస్యలు ఉంటే గుర్తించడానికి ప్రభుత్వం ప్రతి ఇంటికి వెళ్లి సమగ్ర సర్వేను నిర్వహిస్తోందని అన్నారు. సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించేందుకు వైసీపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రతి సచివాలయంలో ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తోందని తెలిపారు. ఈ శిబిరాలు ధ్రువపత్రాలను పంపిణీ చేయ డానికి, పౌరుల సమస్యలను సమర్థవంతంగా పరిష్కరిం చడానికి ఒక వేదికగా పనిచేస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం చైర్ పర్సన్ ఎల్ ఎస్తేరమ్మ, వైస్ చైర్మన్లు కె అనంతలక్ష్మి, పద్మేష్, వార్డు కౌన్సిలర్ విజయలక్ష్మి, వైసిపి నాయకులు సందిరెడ్డి రమేష్, కమిషనర్, పురపాలక సంఘం అధికారులు తదితరులు పాల్గొన్నారు.
రేపల్లె: జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ డి మల్లికార్జున రావు అన్నారు. మండలంలోని పేటేరు గ్రామంలో శుక్రవారం నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రజలు వివిధ రకాల సర్టిఫికెట్ల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా దరఖాస్తు చేసుకున్న వారికి సత్వరమే వాటిని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయమే ఈ కార్యక్రమమని అన్నారు. అనంతరం లబ్ధిదారులకు 680 మంది సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో శివపార్వతి, ఈవోపీఆర్డీ మల్లికార్జునరావు, సర్పంచ్ కనపర్తి వసుమతి కనపర్తి రవికిరణ్, వైస్ ఎంపీపీ రావు నెహ్రూ లక్ష్మి ప్రభాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
పర్చూరు: పర్చూరు మండలంలో జగనన్న సురక్ష కార్యక్రమంలో మొత్తం 952 మందికి సర్టిఫికెట్లు అందజేసినట్లు తహశీల్దారు సంధ్యశ్రీ తెలిపారు. మండలంలోని తిమ్మరాజుపాలెంలో జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో 369 మంది లబ్ధిదారులకు 11 రకాల సర్టిఫికెట్లను తహశీల్దారు సంధ్యశ్రీ పంపిణీ చేశారు. నూతలపాడులో జరిగిన కార్యక్రమంలో 583 మందికి సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో ఎంపిడిఓ ప్రద్యుమ్నకుమార్, సర్పంచ్ కాకర్లమూడి చిన్నయ్య, జెసిఎస్ కన్వీనర్ ముప్పాళ్ల రాఘవయ్య, విఆర్‌ఓలు, సచివాలయ సిబ్బంది, గృహసారథులు పాల్గొన్నారు.










