ప్రజాశక్తి - సీతంపేట : మండలంలోని దోనుబాయి సచివాలయ పరిధిలో మంగళవారం ఏర్పాటు చేసిన జగనన్న సురక్ష కార్యక్రమంలో పాలకొండ ఎమ్మెల్యే వి.కళావతి పాల్గొన్నారు. ప్రజలకు అవసరమైన సర్టిఫికెట్లు,వివిధ ప్రభుత్వ పథకాలతో పాటు ప్రభుత్వ సేవలకు సంబంధించి ఏవైనా పెండింగ్‌లో ఉన్న సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించడానికి ప్రజలకు రక్షగా.. జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి ఒక్కరి సమస్యలను పరిష్కరించడానికే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రజల ముందుకు తీసుకువచ్చిందని, దీన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం లబ్ధిదారులకు ధ్రువపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కూరంగి వెంకినాయుడు, ఎఎంసి చైర్మన్ చైర్మన్ హిమారిక మోహన్‌రావు, సచివాలయ కన్వీనర్ కోటేశ్వరరావు, తహశీల్దార్ నర్సింహూమూర్తి, ఎంపిడిఒ కొండపల్లి సత్యం, ఎంఇఒలు ఆనందరావు, సూర్యచంద్రరావు, తదితరులు పాల్గొన్నారు.
భామిని : మండలంలోని వడ్డంగిలో జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమం ఎమ్మెల్యే వి.కళావతి లబ్దిదారులకు ధ్రువ పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపిపి బోనగడ్డి ధర్మారావు, వడ్డంగి సర్పంచ్ కొండగొర్రి ఉషారాణి, పిఎసిఎస్ చైర్మన్ బోదేపు రఘుపతినాయుడు, జెసిఎస్ కో-ఆర్డినేటర్ కొత్తకోట చంద్రశేఖర్, కొరమ సర్పంచ్ అగుతముడి రఘుపతి నాయుడు, జెడ్‌పిటిసి ప్రతినిధి బొడ్డేపల్లి ప్రసాదరావు, గెల్లంకి రమేష్, పలువురు అధికారులు, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కొమరాడ : ప్రజలకు అవసరమైన ధ్రువపత్రాలు ప్రజలు ఇంటి వద్దకే వచ్చి అందజేయడం జరుగుతుందని ఎంపిపి శెట్టి శ్యామల అన్నారు. మండలంలో మాదలింగిలో జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. తహశీల్దార్ సిహెచ్ రాధాకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న 52 మంది ప్రజలకు వివిధ ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. అలాగే ఎంపిడిఒ మల్లికార్జున ఆధ్వర్యంలో పెదశేఖలో జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని పలు వీధులను సందర్శించి ప్రజల సమస్యలను అధికారులు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఇఒపిఆర్‌డి రాధాకృష్ణ, ఎఒ శంకరరావు, సర్పంచ్ కళావతి, తోడుము సర్పంచ్ వై.సింహాచలం, నాయకులు శెట్టి మధుసూదనరావు, పంచాయతీ కార్యదర్శి జగత్, వాలంటీర్లు సచివాలయం ఉద్యోగులు పాల్గొన్నారు.
సాలూరు: మండలంలోని బాగువలసలో సర్పంచ్ రెడ్డి సుకన్య ఆధ్వర్యాన జగనన్న సురక్ష కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ రెడ్డి పద్మావతి మాట్లాడుతూ అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందేలా చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. కార్యక్రమంలో వైస్ ఎంపిపి రెడ్డి సురేష్ కుమార్ పాల్గొన్నారు. పట్టణంలో: మున్సిపాలిటీ పరిధిలోని 13,14వార్డుల్లో జగనన్న సురక్ష కార్యక్రమం అక్కేన వీధి, బంగారమ్మ కాలనీలో నిర్వహించారు. మున్సిపల్ చైర్ పర్సన్ పువ్వుల ఈశ్వరమ్మ, వైస్ చైర్మన్‌లు జర్జాపు దీప్తి, వంగపండు అప్పలనాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొని ధ్రువపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు హరి అప్పలకొండ, పి.మధుసూధనరావు, వైసిపి నాయకులు హరి బాలాజీ పాల్గొన్నారు.
సాలూరు రూరల్ : మండలంలోని పెదపదంలో జగనన్న సురక్ష కార్యక్రమం ఎంపిడిఒ ఎ.రమాదేవి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైస్ ఎంపిపి రెడ్డి సురేష్, జిల్లా గ్రంధాలయ సంస్థ అధ్యక్షులు రెడ్డి పద్మావతి వివిధ రకాలు ధ్రువపత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రెడ్డి పావని, కార్యదర్శి రోహిణి, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.
పార్వతీపురంరూరల్: మండలంలోని బాలగొడబ, జమదాల సచివాలయాల పరిధిలో జరిగిన జగనన్న సురక్ష కార్యరక్రమానికి స్థానిక ఎమ్మెల్యే ముఖ్య అతిధిగా హారైన లబ్ధిదారులకు ధ్రువపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపిడివో ఎస్ రమేష్, తహశీల్దార్ శివన్నారాయణ, ఎంపిపి మజ్జి శోభారాణి, జెడ్‌పిటిసి బలగరేవతి, వైస్ ఎంపిపి సిద్దాజగన్నాధరావు, బలగొడబ సర్పంచ్ రాములమ్మ, ఎంపిటిసి నీలవేణి, నాయకులు బంకపల్లి రామకృష్ణ, పండు, మువ్వల సత్యనారాయణ, సీనియర్ నాయకులు, మజ్జి చంద్రశేకర్, బలగనాగేశర్రావు, బొమ్మిరమేష్, భీమరపు కృష్ణమూర్తి, మడక విశ్వనాధం వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, సచివాలయం ఉద్యోగులు, వాలంటీర్లు, సచివాలయం కన్వీనర్లు, గహ సారథులు, స్థానిక ప్రజలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
సీతానగరం: మండలంలోని గెడ్డలిప్పి సచివాలయం పరిధిలో జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జెడ్‌పిటిసి సభ్యులు ఎం.బాబ్జీ మాట్లాడుతూ ప్రభుత్వం 11 రకాల సేవలను ఈ కార్యక్రమంలో ద్వారా ఉచితంగా అందిస్తుందన్నారు. కార్యక్రమంలో ఎంపిపి బి.రమణమ్మ, శ్రీరాములునాయుడు, ఎంపిడిఒ ఎంఎస్‌ఇఎల్‌ఎన్, ప్రసాద్, తహశీల్దార్ ఎంవి రమణ, ఆయా గ్రామ సర్పంచులు, వైసిపి నాయకులు బి.చిట్టిరాజు, ఎన్.ధనుంజనాయుడు, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
పాలకొండ: నగర పంచాయతీలో కోటదుర్గ సచివాలయం పరిధిలోని 9, 14 వార్డులు, గారమ్మ కాలనీ సచివాలయం పరిధిలోని 17, 19 వార్డులకు సంబంధించి జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్సీ పి.విక్రాంత్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా అర్హులైన వారు తమ సమస్యలు పరిష్కరించుకోవాలని కోరారు. కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్ యందవ రాధా కుమారి, వైస్ చైర్మన్ రౌతు హనుమంతరావు, కౌన్సిలర్లు కొరికాన గంగు నాయుడు, తూముల లక్ష్మణరావు, పల్లా భాను, కొంచాడ అరుణ్, దుప్పాడ పాపినాయుడు, కడ్రోతు లక్ష్మీ, పాల్గొన్నారు. ఈ సందర్భంగా 11 రకాల సర్టిఫికెట్స్ ను ఎమ్మెల్సీ అందజేయడం జరిగింది.
వీరఘట్టం : మండలంలోని కత్తులకవిటిలో జగనన్న సురక్ష కార్యక్రమం జరిగింది. స్థానిక జడ్పిటిసి జడ్పిటిసి జంపు కన్నతల్లి- ఉమామహేశ్వర రావు అర్జీదారులకు వివిధ రకాల ధ్రువ పత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి పి.కిరణ్ కుమార్, తహశీల్దార్ సిహెచ్ సత్యనారాయణ, సర్పంచ్ జీ సరోజిజి, ఎంపిటిపి కె.పరిమళ, సీనియర్ నాయకులు రిషికేశవరావు, తదితరులు పాల్గొన్నారు.










