
మాట్లాడుతున్న కిషోర్
ప్రజాశక్తి-కందుకూరు :. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైద్యాన్ని అందరికీ అందించాలనే ఉద్ధేశ్యంతో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ప్రజల ముంగిటకు ఆరోగ్య సేవలు తీసుకవచ్చారని జెసిఎస్ కో ఆర్డినేటర్ ముప్పవరపు కిషోర్ పేర్కొన్నారు. కందుకూరు కోటు వారి స్ట్రీట్ 2 సచివాలయం పరిధిలో జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులో పాల్గొన్న జెసిఎస్ కో ఆర్డినేటర్ మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని ప్రతి గహానికి ఆరోగ్య సేవలు అందించే లక్ష్యంతో శాసనసభ్యులు మానుగుంట మహీధరరెడ్డి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అమలుపై ప్రత్యేక దష్టి సారించారన్నారు. మున్సిపల్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్, రావులకొల్లు బ్రహ్మానందం పాల్గొన్నారు .