Oct 26,2023 22:30

ప్రజాశక్తి-యంత్రాంగం జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. గండేపల్లి గండేపల్లి మండలం తాళ్లూరు గ్రామంలో జగనన్న సురక్ష కార్యక్రమంలో ఎంఎల్‌ఎ జ్యోతుల చంటిబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహిస్తోందన్నారు. ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి, ప్రజల ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకుని వైద్య శిబిరంలో సేవలందిస్తున్నారన్నారు. పేదలకు అందిస్తున్న సురక్ష కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రతి సచివాలయంలోనూ ఆరోగ్యానికి సంబంధించిన పరీక్షలు ప్రజలకు నిర్వహించి, సంబంధిత వ్యాధులకు ఉచితంగా మందులు పంపిణీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ శీలామంతుల వీరబాబు, జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు ఒబిన్ని వీరబాబు, కందుల చిట్టిబాబు, అడబాల రామాంజనేయులు, ఎంపిడిఒ వెంకటరామన్‌, తహశీల్దారు కెవివి సత్యనారాయణ, ఇఒపిఆర్‌డి మూర్తి, మెడికల్‌ ఆఫీసర్‌ సౌమ్య, కార్యదర్శి పోతుల శిరీష పాల్గొన్నారు. జగ్గంపేట రూరల్‌ వైఎస్‌ఆర్‌ సేవాదళ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జెసిఎస్‌ జిల్లా కో ఆర్డినేటర్‌ ఒమ్మి రఘురామ్‌ మండలంలోని మామిడాడలో ఏర్పాటు చేసిన జగనన్న సురక్ష కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ లక్ష్యంగా జగనన్న ఆలోచనా విధానం నుంచి పుట్టిన అద్భుతమైన పథకం జగనన్న ఆరోగ్య సురక్షా అని స్పష్టం చేశారు. వైద్యులను అడిగి వైద్య సేవలు అందుతున్న తీరును, స్పెషలిస్టులకు రిఫర్‌ చేసిన కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోగులకు మందులు పంపిణీ చేశారు. గర్భిణులకు పౌష్టికాహార కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ వసంత్‌ కుమార్‌, మామిడాడ సర్పంచ్‌ కర్రి శ్రీను తదితరులు పాల్గొన్నారు. తాళ్లరేవు ప్రజారోగ్యమే ప్రభుత్వ ధ్యేయమని ఎంపిపి రాయుడు సునీత అన్నారు. కోరంగి పంచాయతీ పాత కోరంగిలో గురువారం నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో 480 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రాథమిక పాఠశాలలో సర్పంచ్‌ పెయ్యల మంగేష్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపిపి రాయుడు సునీత, జెడ్‌పిటిసి డి.సామ్యూల్‌ సాగర్‌ హాజరయ్యారు. పంచాయతీ కార్యదర్శి పి.రామరాజు పర్యవేక్షణలో వైద్యులు జయ భార్గవి, ఈశ్వర్‌ కుమార్‌, మరో నలుగురు వైద్య నిపుణులు 480 మందిని పరీక్షించారు. అనంతరం రోగులకు ఉచితంగా మందులు, గర్భిణులకు పౌష్టికాహార కిట్లను నేతలు అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి సభ్యులు పోతుల రత్నకుమారి, పాలెపు పోసియ్య, నాయకులు కొపనాతి నాగరాజు, కామాడి భైరవమూర్తి, రొక్కం లోవరాజు, దడాల పండు, సీలం బాలకష్ణ పాల్గొన్నారు. రౌతులపూడి మండలంలోని గిడజాంలో ఎంపిడిఒ గోవింద్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో 400 మంది రోగుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్యాధికారి, కె.రాజాజీ, సౌందర్య, ఎం.విశ్వనాథ్‌, వీరేంద్ర పాల్గొన్నారు.