Jul 12,2023 23:37

ధ్రువపత్రాలు అందజేస్తున్న చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ

ప్రజాశక్తి-కశింకోట
జగనన్న సురక్ష కార్యక్రమం వల్ల లబ్ధిదారులకు మేలు జరుగుతుందని ఎమ్‌పిపి కలగా లక్ష్మి, జెడ్‌పిటిసి దంతులూరి శ్రీధర్‌ రాజు అన్నారు. మండలంలోని ఉగ్గినపాలెం గ్రామంలో బుధవారం జగనన్న సురక్ష కార్యక్రమం జరిగింది. ఇంటిగ్రేటెడ్‌ పత్రం 498, ఆదాయ ధ్రువపత్రాలు 153, కుటుంబ సభ్యుల ధ్రువపత్రాలు 4, రేషన్‌ కార్డులకు సంబంధించిన 30 పత్రం పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్‌ కలగా గున్నయ్యనాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపిపి నమ్మి మీనా, ఎమ్‌పిడిఓ రవికుమార్‌, తహశీల్దారు సత్యనారాయణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు
అనకాపల్లి : ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఇంటి వద్దకే ప్రభుత్వం లబ్ధిదారులకు కావలసిన ధ్రువపత్రాలను జగనన్న సురక్ష పథకం కింద అందజేస్తుందని మండల పరిషత్‌ అధ్యక్షులు గొర్లి సూరిబాబు అన్నారు. మండలంలోని రేబాక, పిసినికాడ గ్రామ సచివాలయాల వద్ద బుధవారం జగనన్న సురక్ష కార్యక్రమాలు జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన గొర్లి సూరిబాబు చేతుల మీదుగా లబ్ధిదారులకు ధ్రువీకరణ పత్రాలను అందించారు. ఇళ్ల స్థలం లేకపోతే జగనన్న సురక్ష ద్వారా దరఖాస్తు చేసుకుంటే 90 రోజుల్లోగా మంజూరు చేస్తారని తెలిపారు. కార్యక్రమాల్లో ఎంపీడీవో కేవీ నరసింహారావు, సర్పంచ్‌ మార్టూరు సన్యాసమ్మ, మార్టూరు లక్ష్మణ్‌, ఎంపీటీసీ మంత్రి సంతోషం, మంత్రి సత్యనారాయణ, ఈవోపీఆర్డి కె.ధర్మారావు, పిసినికాడ సర్పంచ్‌ యల్లపు వెంకట రమేష్‌, ఎంపీటీసీ మొల్లేటి హైమా శివాజీ పాల్గొన్నారు.
చోడవరం : ప్రజల అవసరాలను తీర్చడంలో జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వానికి మరేదీ సాటి రాదని స్థానిక ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు. మండలంలో దుడ్డుపాలెం గ్రామంలో జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో ఆయన అతిథిగా పాల్గొన్నారు. గ్రామానికి చెందిన లబ్ధిదారులకు వివిధ సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అవసరమయ్యే సర్టిఫికెట్ల కోసం గతంలో మండల కార్యాలయాలు చుట్టూ తిరగాల్సి వచ్చేదని, ఇప్పుడు సచివాలయాల్లో అందిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ గాడి కాసు, ఇఒపిఆర్‌డి చైతన్య, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఏడవక సత్యారావు, వైసిపి నాయకులు శ్రీరామ్మూర్తి మాస్టారు పాల్గొన్నారు.
కె.కోటపాడు : జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ప్రజలకు అవసరమయ్యే ధ్రువపత్రాలు ఎటువంటి రుసుము తీసుకోకుండా అందజేయడం జరుగుతుందని ఎంపీపీ రెడ్డి జగన్మోహన్‌ అన్నారు. మండలంలోని కింతాడ, కె.సంతపాలెం గ్రామాల్లో బుధవారం జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. లబ్ధిదారులకు వివిధ రకాల ధ్రువపత్రాలను పంపిణీ చేశారు. కింతాడ సచివాలయంలో తహసిల్దార్‌ రమేష్‌ బాబు బృందం కార్యక్రమం నిర్వహించగా, కె. సంతపాలెంలో ఎంపీడీవో కె.శచిదేవి బృందం జగనన్న సురక్ష నిర్వహించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి నాగలక్ష్మి, సర్పంచులు బండారు ముత్యాల నాయుడు, చల్ల మంగ, ఎంపీటీసీ రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.
నక్కపల్లి : ప్రజల ముంగిటకు ప్రభుత్వం సంక్షేమ ఫలాలు అందిస్తుందని ఎమ్మెల్యే గొల్ల బాబురావు అన్నారు. మండలంలోని చినదొడ్డిగల్లు, జానయ్యపేట గ్రామాల్లో బుధవారం జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. చినదొడ్డిగల్లులో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు. లబ్ధిదారులకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సీతారామరాజు, తహసీల్దార్‌ అంబేద్కర్‌, డిటి నీరజ,రాష్ట్ర కాపు కార్పొరేషన్‌ డైరెక్టర్‌ వీసం రామకృష్ణ, ఎంపీపీ రత్నం, జడ్పిటిసి సభ్యురాలు కాసులమ్మ, వైస్‌ ఎంపిపి ఈశ్వరరావు, సర్పంచ్‌ చందర్రావు, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు కొప్పిశెట్టి హరిబాబు, వైసిపి మండల శాఖ అధ్యక్షులు పాపారావు, నాయకులు మణి రాజు, సత్తిబాబు, భార్గవ్‌, వర్మ పాల్గొన్నారు.
మాడుగుల : జగనన్న సురక్ష కార్యక్రమంలో ఎంపీడీఓ మీనా కుమారి, తహసీల్దార్‌ పివి రత్నం అధ్వర్యంలో బృందాలు పలు గ్రామాల సచివాలయాల వద్ద ప్రజలకు వివిధ రకాల ధ్రువపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎం.కోడూరు గ్రామంలో బుధవారం సర్పంచ్‌ గొల్లవిల్లి సంజీవరావు ఆధ్వర్యంలో తహసీల్దార్‌ రత్నంకు సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక పిఏసి ఎస్‌ అధ్యక్షులు గొల్లవిల్లి రాజేష్‌, వైసిపి గ్రామ శాఖ అధ్యక్షులు పడాల అప్పలనాయుడు పాల్గొన్నారు.
కొత్తకోట : రావికమతం మండలం కన్నంపేటలో తహసీల్దార్‌ మహేశ్వరరావు, కొమిరలో ఎంపిడిఓ వెంకన్నబాబు ఆధ్వర్యంలో జగనన్న సురక్ష కార్యక్రమాలు నిర్వహించారు. కన్నంపేటతో పాటు శ్రీరామ్‌ నగర్‌ కాలనీ, వమ్మవరం గ్రామాలకు చెందిన సుమారు 572 మందికి, కొమిర, మత్యపురం గ్రామాలకు చెందిన 456 మంది లబ్ధిదారులకు వివిధ రకాల ధ్రువ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపిపి దంట్ల రమణ, ఆర్‌ఐ చినబ్బాయి, గ్రామ సర్పంచ్‌ దంట్ల సత్యవతి, తోట సంజీవి, మర్రివలస ఎంపిటిసి సభ్యలు లోవరాజు తదితరులు పొల్గొన్నారు.
గొలుగొండ : మండలంలోని లింగంపేట సచివాలయ పరిధిలో బుధవారం జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారులకు 565 ధ్రువపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చిటికెల భాస్కర్‌నాయుడు, ఎంపిపి మణికుమారి, జిల్లా ఎస్సీ సెల్‌ అధ్యక్షులు సుజాత, మండల పార్టీ అధ్యక్షులు లెక్కల సత్యనారాయణ, వైస్‌ ఎంపిపి సుర్ల ఆదినారాయణ, సర్పంచ్‌ సంతోష్‌, ఎంపిటిసి మహాలక్ష్మీ, అధికారులు పాల్గొన్నారు.
సీతమ్మధార : చివరి లబ్ధిదారు వరకు శతశాతం అందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించడమే లక్ష్యంగా జగన్మోహనరెడ్డి ప్రభుత్వం జగనన్న సురక్ష కార్యక్రమాన్ని అమలు చేస్తోందని వైసిపి ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కెకె.రాజు అన్నారు. 46వవార్డు శాంతినగర్‌ సచివాలయం వద్ద నిర్వహించిన సురక్ష శిబిరంలో లబ్ధిదారులకు సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ కటుమూరి సతీష్‌, కోఆప్షన్‌ సభ్యులు సేనాపతి అప్పారావు, జోనల్‌ కమిషనర్‌ ఆర్‌జివి కృష్ణ, తహశీల్ధార్‌ జయ, ఎపిడి పద్మావతి, శైలజ, సీనియర్‌ నేతలు బలిరెడ్డి గోవింద్‌, కె.చిన్న పాల్గొన్నారు.
26వ వార్డులో
26వవార్డు శాంతిపురం, లాల్‌ బహుదూర్‌ శాస్త్రి పార్కు వద్ద జగనన్న సురక్ష శిబిరంలో నెడ్‌క్యాప్‌ చైర్మన్‌ కెకె.రాజు పాల్గొని లబ్ధిదారులకు సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమంలో వార్డు వైసిఇప ఇన్‌ఛార్జి పీలా వెంకటలక్ష్మీ, మాజీ కార్పొరేటర్‌ పోతు సత్యనారాయణ, బులుసు జగదీశ్‌, డైరెక్టర్‌ పాండవ శ్రీను, డిప్యూటీ తహశీల్దార్‌ త్రినాధరావు, నేతలు శేషు, నవాబ్‌, అమ్మాజీ, బాబ్‌ జాన్‌, గౌస్య, సుశీల, రమాదేవి, పాల్‌, ప్రకాష్‌, రోరు, జి.లక్ష్మీ, లలిత, ఫరూక్‌, విజయలక్ష్మి, సంతోష్‌ పాల్గొన్నారు.
ఆనందపురం : మండలంలోని గిడిజాల, కణమాం పంచాయతీలలో ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జగనన్న సురక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఇళ్ల స్థలాల కోసం 130 మంది దరఖాస్తులు చేసుకున్నారు. దిబ్బడిపాలెం, వేమగొట్టిపాలెం, లక్ష్మీదేవి పేట, గిడిజాలలో శ్మశానవాటిక నిర్మాణానికి రూ.32 లక్షలు నిధులు మంజూరు చేయాలని వైస్‌ ఎంపిపి పాండ్రంకి శ్రీను, సర్పంచ్‌ సినగం అప్పలరాజు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. కణమాంలో 200 మందికి ఇల్లు స్థలాలు మంజూరు చేయాలని, ఎపిఐఐసికి ఇచ్చిన భూములకు నష్ట పరిహారం అందించాలని, సిసి రోడ్లు, డ్రైనేజీలు నిర్మించాలని సర్పంచ్‌ ఆబోతు అప్పలరాము తదితరులు ఎమ్మెల్యేకు విన్నవించారు. కార్యక్రమంలో ఎంపిడిఒ లవరాజు, తహశీల్దార్‌ రామారావు, జెడ్‌పిటిసి పోరాట వెంకటరావు, ఎంపిపి మజ్జి శారద ప్రియాంక, వైఎస్‌ ఎంపిపి బొట్ట ధనలక్ష్మి రామకృష్ణ, స్థానిక సర్పంచులు శినగం అప్పలరాజు, ఆబోతు అప్పలరాము, నాయకులు బంక సత్యనారాయణ, మజ్జి వెంకటరావు, శ్రీకాంత్‌రాజు, బి మణిశంకర్‌ నాయుడు, జి.శ్రీను, బిఆర్‌బి నాయుడు, కోరాడ ముసలి నాయుడు, రౌతు శ్రీను పాల్గొన్నారు
తగరపువలస : భీమిలి మండలంలోని మజ్జిపేట, మూలకుద్దు గ్రామాల్లో బుధవారం సాయంత్రం జగనన్న సురక్ష కార్యక్రమాలలో ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు. పలువురు లబ్ధిదారులకు ధ్రువపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు మజ్జి సూరినాయుడు, కొల్లి పార్వతి, జెడ్‌పిటిసి గాడు వెంకటప్పడు, రేఖవానిపాలెం, సింగనబంద సర్పంచ్‌లు సమ్మిడి శ్రీనివాసరావు, జివి నారాయణ, ఎఎంసి చైర్మన్‌ యలమంచిలి సూర్య నారాయణ, వైసిపి నేతలు సిరిగిడి ఈశ్వరరావు, కొల్లి కోటిరెడ్డి పాల్గొన్నారు.
ఆరిలోవ : 10వ వార్డు వైసిపి నాయకులు, మాజీ కార్పొరేటర్‌ జగ్గుపిల్ల అప్పలరాజు ఆధ్వర్యంలో వివేకానందనగర్‌ జివిఎంసి పార్కులో నిర్వహించిన జగనన్న సురక్ష శిబిరంలో పార్టీ తూర్పు సమన్వయకర్త, విఎంఆర్‌డిఎ చైర్మన్‌ అక్కరమాని విజయనిర్మల, జెడ్‌సి కనకమహాలకీë పాల్గొన్నారు. పలువురు లబ్ధిదారులకు ధ్రువపత్రాలను అందజేశారు. లబ్దిదారులు అవసరమైన ధృవపత్రాలను ఉచితంగా పొందేందుకు వాలంటీర్లు ద్వారా సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వార్డు ప్రత్యేకాధికారి రమేష్‌, వైదా నారాయణరావు, బీజపు పైడిరాజు పాల్గొన్నారు.