Jul 26,2023 19:06

ధ్రువపత్రాలను అందజేస్తున్న నాయకులు

ప్రజాశక్తి - మంత్రాలయం
'జగనన్న సురక్ష'తో లబ్ధిదారుల చెంతకు సేవలు చేరుతున్నాయని వైసిపి మండలాధ్యక్షులు భీమిరెడ్డి తెలిపారు. బుధవారం మండలంలోని చెట్నిహల్లి గ్రామంలోనూ, మంత్రాలయంలోని సచివాలయం-3 పరిధిలోనూ ఎంపిడిఒ మణిమంజరి అధ్యక్షతన 'జగనన్న సురక్ష' నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి సచివాలయ వ్యవస్థను తెచ్చి గ్రామాల్లోనే ప్రజలకు సేవలు అందిస్తున్నారని తెలిపారు. ప్రజలకు ఎప్పుడు, ఎలాంటి సేవలు అవసరమైనా ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, రాంపురం రెడ్డి సోదరులు అధికారుల సహకారంతో అందిస్తున్నారని చెప్పారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధికి వారు కృషి చేస్తున్నారని తెలిపారు. లబ్ధిదారులకు వివిధ రకాల ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. సర్పంచులు బెస్త అంజినయ్య, తెల్లబండ్ల భీమయ్య, మండల సచివాలయ కో కన్వీనర్‌ వికెసి రాఘవేంద్రాచారి, తహశీల్దార్‌ చంద్రశేఖర్‌, చెట్నిహల్లి ఎంపిటిసి రామాంజనేయులు, మాజీ సర్పంచి అల్లింగప్ప పాల్గొన్నారు.