
ప్రజాశక్తి - సంతమాగులూరు
ఉన్నత శ్రేణి విద్య, వైద్యం నిరుపేదలకు సైతం అందాలనే లక్ష్యంతో సిఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి దేశంలో ఎక్కడాలేని విధంగా ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని శాప్ నెట్ కార్పొరేషన్ చైర్మన్, వైసీపీ ఇంచార్జి బాచిన కృష్ణ చైతన్య అన్నారు. మండలంలోని ఏల్చూరు-1 సచివాలయ పరిధిలోని జెడ్‌పి ఉన్నత పాఠశాలలో గురువారం జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరంను ఆయన ప్రారంభించారు. నాడు - నేడు ద్వారా పాఠశాలకు కార్పొరేట్ స్థాయిలో మౌలిక వసతులు కల్పించారని అన్నారు. వైద్యశాలలోను కార్పొరేట్ స్థాయి మౌలిక వసతులు కల్పించారని అన్నారు. ప్రభుత్వ పరిపాలనను గ్రామ, వార్డు, సచివాలయాల వ్యవస్థ ద్వారా పేదలకు అందుబాటులోకి తేవడంతో పాటు విలేజ్ క్లినిక్‌లు ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో అందరికీ వైద్యం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఫ్యామిలీ డాక్టర్ పద్ధతిని ప్రవేశ పెట్టారని అన్నారు. ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితిని రెండు విడతలుగా జల్లెడ పట్టి చిన్న, పెద్ద తేడా లేకుండా అన్ని వ్యాధులకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సురక్ష కార్యక్రమం తీసుకున్నట్లు తెలిపారు. అనంతరం మందుల కిట్లను అందజేశారు. కార్యక్రమంలో సర్పంచి మందా సూరిబాబు, జడ్పిటిసి అడవి శ్రీనివాసరావు, వైసిపి మండల కన్వీనర్ చింతా రామారావు, డి గాలెయ్య, బొల్లినేని రామకృష్ణ, నాగభోతు రామాంజనేయులు పాల్గొన్నారు.