Oct 26,2023 00:02

ప్రజాశక్తి - చీరాల 
ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ప్రతి ఇంటికి వైద్య సేవలు అందిస్తొందని, ప్రజల సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీఒ నేతాజీ కోరారు. వైసిపి  ఇంచార్జి కరణం వెంకటేష్ సూచనలతో మండలంలోని పాత చీరాల సచివాలయంలో జగనన్న ఆరోగ్య సురక్ష వైద్యశిభిరం బుధవారం నిర్వహించారు. కార్యక్రమంలో అర్బన్ ఫైనాన్స్  కార్పొరేషన్ డైరెక్టర్, మాజీ ఎంపీపీ గవిని శ్రీనివాసరావు, వైసిపి మండల అధ్యక్షులు ఆసాది అంకాలరెడ్డి, పిఏసిఎస్ అధ్యక్షులు బోయిన కేశవులు, ఆర్బికె ఛైర్మన్‌ కావూరి రమణరెడ్డి, జెసిఎస్ అధ్యక్షుడు బుర్ల సాంబశివరావు, మాజీ వైస్ ఎంపీపీ నాదెండ్ల కోటేశ్వరరావు, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు నల్లబోతుల రాజ్‌కుమార్, వైసిపి జిల్లా కార్యదర్శి బండారు శివపార్వతి, వైసీపీ నాయకులు దుడ్డు మార్కు బాబు, పర్వతనేని శ్రీనివాసరావు , షేక్ ఆజాద్, పిట్టు పోలయ్య, బక్క శివప్రసాదరెడ్డి,  కోడూరి అంజిబాబు, బక్క అద్దంకిరెడ్డి, బక్కా శివనాగుల్‌రెడ్డి, ముచ్చు దేవేందరరావు, బోయిన బాజీరెడ్డి, ఆసాది దశరధరామిరెడ్డి, కుంచాల రత్నారెడ్డి, నంగు పుల్లారెడ్డి, ఆసాది సాంబశివారెడ్డి, పంచాయతీ కార్యదర్శి అనిల్ పాల్గొన్నారు.