Jun 27,2023 21:09

జగనన్న సురక్ష సర్వేను పరిశీలించిన కలెక్టర్‌ గిరీష

గాలివీడు : ఇంటి వద్దకే వచ్చి ప్రభుత్వ సేవలు అందించే 'జగనన్న సురక్ష' కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ గిరీష తెలిపారు. మంగళవారం మండలంలోని ప్యారంపల్లె (రెడ్డివారిపల్లె)లో జగనన్న సురక్ష వాలంటీర్‌ సర్వేను కలెక్టర్‌ పరిశీలించారు. ఎన్ని ఇళ్లు సర్వే చేశారు, సర్వీస్‌ రిక్వెస్ట్‌ ఎంతమంది అడిగారు, టోకన్‌ జనరేట్‌ చేశారా వంటి వివరాలను వాలంటీర్‌, ఎంపిడిఒను కలెక్టర్‌ అడిగి తెలుసుకున్నారు. వాలంటీర్‌ మీ గ్రామంలో సర్వేపై దండోరా వేయించారా వంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. పెన్షన్‌, వైఎస్సార్‌ రైతు భరోసా, చేయూత పథకాలు తమకు ఈ ప్రభుత్వంలో వచ్చాయిని లబ్ధిదారులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. అర్హత ఉండి లబ్ధి అందని వారిని గుర్తించి కారణాలు తెలుసుకుని సమస్య పరిష్కరించేందుకు అవసరమైన పత్రాలను సేకరించి టోకెన్లు అందిస్తారని వెల్లడించారు. కార్యక్రమంలో ఎంపిడిఒ శేఖర్‌ నాయక్‌, సర్పంచ్‌, వాలంటీర్లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.