
ప్రజాశక్తి గూడూరు : ఆరోగ్యాన్ని పరిరక్షించి, ప్రజల ఆయుష్షును పెంచే బాధ్యతను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వీకరించారని రాష్ట్ర గహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు.గూడూరు మండలం మల్లవోలు గ్రామంలో జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రాంగణంలో శనివారం నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరంలో మంత్రి జోగి రమేష్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించాలని జగనన్న ఆరోగ్య సురక్షను ప్రవేశపెట్టారన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరంలో 162 రకాల నాణ్యమైన మందులు సిద్ధంగా ఉంచామన్నారు. ఈ కార్యక్రమంలో గూడూరు ఎంపీపీ సంగా మధుసూదన్ రావు, జడ్పిటిసి వేముల సురేష్ రంగబాబు, కారుమంచి కామేశ్వరరావు, తలుపుల వెంకటకష్ణ, గొరిపర్తి రవికుమార్, మండల పార్టీ అధ్యక్షుడు పర్ణం పెద్దబాబు తదితరులు పాల్గొన్నారు.