Jul 10,2023 22:35

ప్రజాశక్తి - పోలవరం
          జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని ఎంఎల్‌ఎ తెల్లం బాలరాజు సూచించారు. ఎల్‌ఎన్‌డిపేటలో సోమవారం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎంఎల్‌ఎ మాట్లాడుతూ ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపిల సంఘం జిల్లా అధ్యక్షులు పోలవరం ఎంపిపి సుంకర వెంకటరెడ్డి, ఐటిడిఎ పిఒ జివివి.సత్యనారాయణ, ఎంపిడిఒ జి.శ్రీను, తహశీల్దార్‌ బి.సుమతి, ఎంపిపి సుంకర వెంకటరెడ్డి, జెడ్‌పిటిసి సభ్యులు కె.హేమకుమారి, వైసిపి మండల కన్వీనర్‌ బుగ్గ మురళీకృష్ణ పాల్గొన్నారు.
మండవల్లి : సంక్షేమ పథకాలను పటిష్టంగా అమలు చేయడం సిఎం జగన్‌కే సాధ్యమని కైకలూరు ఎంఎల్‌ఎ దూలం నాగేశ్వరావు అన్నారు. కొవ్వాడలంక సచివాలయం పరిధిలో సోమవారం నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పాదయాత్రలో తెలుసుకుని అవినీతికి తావు లేకుండా అర్హులైన లబ్ధిదారులకు అందించేందుకు సచివాలయ వ్యవస్థను రూపొందించారన్నారు. అనంతరం అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి పెద్దిరెడ్డి శ్రీరామ్‌ దుర్గాప్రసాద్‌, పార్టీ మండల అధ్యక్షులు గుమ్మడి వెంకటేశ్వరరావు, సర్పంచి జయమంగళ తిరుపతి వెంకన్న, ఉపసర్పంచి మోరు కృష్ణమోహన్‌ పాల్గొన్నారు.
నూజివీడు రూరల్‌ : పోతిరెడ్డిపల్లిలో నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో ఎంఎల్‌ఎ మేకా వెంకటప్రతాప్‌ అప్పారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హత ఉండి సంక్షేమ పథకాలు రానివారికి అందించేందుకు ఈ కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేస్తున్నామన్నారు.
జీలుగుమిల్లి : జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆర్‌డిఒ ఎం.జాన్సీరాణి సూచించారు. పాలచర్ల, రాజవరం పంచాయతీలోని రైతు భరోసా కేంద్రంలో ఏర్పాటు చేసిన జగనన్న సురక్ష కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్హులైన ప్రతిఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమం నెల రోజుల పాటు జరుగుతుందని మొత్తం 11 రకాల సేవలను ఉచితంగా అందిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ పరిధిలో 540 ఇళ్ల సర్వేను వాలంటీర్లు పూర్తి చేశారన్నారు. ఈ సందర్భంగా వివిధ ధృవపత్రాల కోసం దరఖాస్తు చేసుకున్న 395 మందికి పత్రాలు పంపిణీ చేశారు. అనంతరం రైతు భరోసా కేంద్ర పరిసరాల్లో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి పివిఎస్‌.నాయుడు, ఎంపిపి కె.పోసమ్మ, జెడ్‌పిటిసి సభ్యులు వసంతరావు, తహశీల్దార్‌ సుందర్‌సింగ్‌, ఎంపిడిఒ కృష్ణప్రసాద్‌ పాల్గొన్నారు.