Oct 01,2023 22:43

'జగనన్న సురక్ష'తో అందరికీ ఆరోగ్యం..
ఇంటివద్దే ఏడు రకాల వైద్యపరీక్షలు
జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి ప్రభావతిదేవి
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:

జగనన్న సురక్ష అనే పథకాన్ని ప్రభుత్వం ప్రతి ఇంటి వద్దకు వెళ్లి ప్రజలకు ప్రభుత్వం నుండీ మెరుగైన వైద్యం అందించేందుకు ఈ పథకాన్ని అమలు చేస్తోంది. గత నెల 30వ తేది నుండీ ఈ పథకం ద్వారా వైద్యపరీక్షలు నిర్వహించడం జరుగుతోంది. ఇప్పటికే వైద్యఆరోగ్యశాఖ అధికారులు జిల్లా వ్యాప్తంగా సర్వే నిర్వహించారు. సర్వే ఆధారంగా వైద్యపరీక్షల చేయడం జరుగుతుంది. ప్రతి ఇంట్లోని వ్యక్తి ఆరోగ్య పరిస్థితి ప్రోఫైల్‌ సిద్ధం చేయడం జరుగుతోంది. ఇందులో బ్లెడ్‌గ్రూప్‌, ఏఏ రకాల జబ్బులతో బాధపడుతున్నారు. వీటిలో దీర్ఘకాలీక వ్యాధులతో బాధపడుతున్నారా.... అనే విషయాలను పొందుపర్చడం జరుగుతుంది.
ప్రజాశక్తి: జగనన్న సురక్ష పథకంలో ఎన్ని రకాల వైద్యపరీక్షలు నిర్వహిస్తారు...?
డిఎంఅండ్‌హెచ్‌ఒ: జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా గ్రామం, వార్డులో పూర్తిగా మ్యాప్‌ చేయబోతున్నాం. ప్రతి గ్రామం, వార్డులో ప్రతి ఇంటినీ, జల్లెడ పట్టి, ఏ ఇంట్లో ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయి అనే విషయాన్ని తెలుసుకొనేందుకు ఆ ఇంటి దగ్గరే 7 రకాల పరీక్షలు అక్కడిక్కడే వైద్య ఆరోగ్యశాఖ యంత్రంగాం వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.
ప్రజాశక్తి : నగరపాలక సంస్థలో ఏవిధంగా జగనన్న సురక్ష కార్యక్రమం జరుగుతుంది....?
డిఎఅండ్‌హెచ్‌ఒ: నగరపాలిక, పురపాలికల్లో ప్రజలక అందుబాటులో ఉండే సెంటర్లలో వైద్యపరీక్షలు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇంటింటా సర్వేలో వైద్యపరీక్షల కోసం గుర్తించిన వారికి ఈ సెంటర్లకు వద్దకు వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది తీసుకేళ్ళి వైద్యపరీక్షలు చేయిస్తారు. రిపోర్టుల ఆధారంగా వైద్యం అందించడం జరుగుతుంది.
ప్రజాశక్తి : జిల్లాలో ఎన్ని క్యాంపులు ఏర్పాటు చేశారు. ఎన్ని రకాల వ్యాధులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు?
డిఎంఅండ్‌హెచ్‌ఒ: జిల్లాలో 478 క్యాంపులలో ప్రత్యేక వైద్యులను ఏర్పాట్లు చేశాం, 11 రకాల వ్యాధులకు సంబంధించి ప్రత్యేక వైద్యులు వైద్యసేవలను అందిస్తున్నారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి. ప్రత్యేక క్యాంపులో వైద్య సేవలు పొందేందుకు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు.
ప్రజాశక్తి: ఇంటింటా సర్వేలో గుర్తించిన అంశాలు ఏమిటి....?
డిఎంఅండ్‌హెచ్‌ఒ: 15 రోజుల నుంచి ప్రభుత్వం నిర్ణయించిన విధి విధానాల మేరకు దశలవారీగా వాలంటీర్లు వైద్యసిబ్బంది ఇంటింటికి వెళ్లి ఇంట్లోని ప్రతిఒక్కరిని పలకరించి వారి ఆరోగ్య పరిస్థితుల గురించి తెలుసుకొని అనారోగ్యం ఉన్న వారిని గుర్తించి ఆ వ్యాధులకు సంబంధించి పరీక్షలు చేసి తగిన మందులు ఇవ్వడం జరిగింది. అనంతరం చికిత్సల కోసం అవసరమైన డాక్టర్ల వద్దకు వెళ్లేందుకు టోకన్లు ఇవ్వడం జరిగింది. టోకెన్లు పొందిన వారు ప్రత్యేకంగా నిర్వహిస్తున్న శిబిరాలకు రావడం, శిబిరాలలో 11 రకాల వ్యాధులకు సంబంధించి ప్రత్యేక వైద్యులు సేవలు అందిస్తున్నాం. అవసరమైన వారికి మందులు పంపిణీ చేస్తున్నాం.
ప్రజాశక్తి: జగనన్న సురక్షలో ఎంతమంది వైద్యసిబ్బంది వైద్యసేవలు అందిస్తున్నారు....?
డిఎంఅండ్‌హెచ్‌ఒ: గత నెల 30వ తేది నాటికి 32 మెడికల్‌ క్యాంపులు ప్రారంభమయ్యాయి. మొత్తం 13,026 మంది ఓపీలు పొందారు. 66 మంది పిహెచ్‌సీ డాక్టర్లు, 79 మంది స్పెషలిస్టు డాక్టర్లు వైద్యసేవలందిస్తున్నారు. జగనన్న సురక్ష కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది. సచివాలయల్లో పని చేస్తున్న నర్సులు, ఏఎన్‌ఎంలు వైద్యసేవలందిస్తున్నారు.
-డాక్టర్‌ ప్రభావతిదేవి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి