Sep 30,2023 20:34

జగనన్న సురక్షతో అందరికీ ఆరోగ్యం

రాజంపేట అర్బన్‌ : రాష్ట్రంలో ఏ ఒక్కరూ వైద్యం కోసం ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని చేపట్టి మన రాష్ట్రాన్ని ఆరోగ్యంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దాలన్నదే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని ఎమ్మెల్యే మేడా వెంకట మల్లిఖార్జునరెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ పోలా శ్రీనివాసులురెడ్డి పేర్కొన్నారు. శనివారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయ ఆవరణంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగనన్న సురక్షతో ప్రతి పేదవాడికి ఉచిత వైద్యం అందుతుందని చెప్పారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఐదు దశలుగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ో గ్రామంలోని విలేజ్‌ క్లినిక్‌ లో భాగంగా ఆశా వర్కర్లు, వాలంటీర్లు మమేకమై ప్రతి ఇంటిని జల్లెడపట్టి సర్వే చేసి ప్రతి ఇంట్లో బీపీ, షుగర్‌, హిమోగ్లోబిన్‌ పరీక్షలు చేస్తారని వివరించారు .అవసరాన్ని బట్టి యూరిన్‌ మలేరియా, డెంగ్యూ, కఫం పరీక్షలు కూడా చేస్తారని తెలిపారు. ఇలా ఏడు రకాల పరీక్షలు నిర్వహించి ప్రతి ఇంటికి లో ప్రతి ఒక్కరి ఆరోగ్యంపై ఒక నివేదిక ఇచ్చి ఆరోగ్య శ్రీ పథకాన్ని ఎలా వినియోగించుకోవాలో, ఆరోగ్యశ్రీ యాప్‌ డౌన్లోడ్‌ చేసుకునేలా అవగాహన కల్పిస్తారన్నారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల్లో రక్తహీనత నివారణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారికి మందులు ఇవ్వడమే కాకుండా మ్యాపింగ్‌ చేసి ఫుడ్డు సప్లిమెంటేషన్‌ కోసం వాలంటీర్లు చర్యలు చేపడతారని తెలిపారు. కార్యక్రమంలో రాజంపేట వార్డు కౌన్సిలర్లు, వైద్య సిబ్బంది, వాలంటీర్లు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.నందలూరు : శనివారం పాటూరు పంచాయతీలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన జగనన్న సురక్ష వైద్య సేవలను ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, ఎంపిపి మేడా విజయభాస్కర్‌రెడ్డిలు ప్రారంభించారు. కార్యక్రమంలో పాటూరు సర్పంచ్‌ అక్కిరెడ్డి స్వరూప, మండల పార్టీ అధ్యక్షుడు అన్నం నాగేంద్ర, జిల్లా వక్స్‌ బోర్డ్‌ ప్రధాన కార్యదర్శి సయ్యద్‌ అమీర్‌, ఎంపిడిఒ సౌభాగ్యమ్మ, వైద్యాధికారులు సజన, చంద్రశేఖర్‌ రెడ్డి, అనురాధ, వైసిపి నాయకులు గడికోట సుబ్బారెడ్డి, అక్కిరెడ్డి మోహన్‌రెడ్డి, తోట శ్రీనివాసులు, పల్లంరాజా, మారెం బాలసుబ్రమణ్యం, ఓర్సు శ్రీనివాసులు, పెనుబాల నాగసుబ్బయ్య, ఆర్ముగం విశ్వనాథ్‌, బూసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, కాకి చంద్ర, విజయుడు పాల్గొన్నారు. బి.కొత్తకోట : ప్రతి ఇంటికి వైద్యసేవలు అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రవేశపె ట్టిందని నగర పంచాయతీ కమిషనర్‌ పి.ఆర్‌.మనోహర్‌ పేర్కొన్నారు. కార్యక్రమంలో డాక్టర్‌ కిరణ్‌,పురుషోత్తం,డాక్టర్‌ శంకర్‌, రజిని, రాధిక, విమల దేవకప, మోజుద్దీన్‌, తహశీల్దార్‌ రఫీఅహ్మద్‌, డిటి అన్సర్‌, నగర పంచాయతీ మేనేజర్‌ రమాదేవి, నగర పంచాయతీ ఆర్‌ఐ శ్రీనివాసులు పాల్గొన్నారు. నిమ్మనపల్లి : జగనన్న ఆరోగ్య సురక్ష ప్రజలకు దేవుడిచ్చిన వరం లాంటిదని ఎంపిడిఒ శేషగిరిరావు, మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ రమేష్‌బాబు అన్నారు. శనివారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు జగనన్న ఆరోగ్య సురక్ష ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఎంపిపి నరసింహులు, మండల వైసిపి ఇన్‌ఛార్జి ఆర్‌ఐ రమణారెడ్డిలతో కలిసి వారు ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని డి ఎల్‌ డి ఓ లక్ష్మీపతి, మండల ప్రత్యేక అధికారి వెంకటేశ్వర రెడ్డి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. కార్యక్రమంలో మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ రమేష్‌బాబు, డాక్టర్‌ దీక్షితారాణి, డాక్టర్‌ రాజేశ్వరి, డాక్టర్‌ అర్షియాఅంజుమ్‌, డాక్టర్‌ సనా, అంగన్వాడీ సూపర్వైజర్‌ భాను లక్ష్మీదేవి, ఎంఎల్‌హెచ్‌పిలు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. పుల్లంపేట : ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ లక్ష్యంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని చేపట్టినట్లు ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు తెలిపారు.మండలంలోని కొమ్మనవారిపల్లి గ్రామ సచివాలయ పరిధిలో జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కోటి 62 లక్షల కుటుంబాలు ఆరోగ్యవంతంగా ఉండాలన్న ధ్యేయంతో 45 రోజుల పాటు 'జగనన్న ఆరోగ్య సురక్ష' వైద్య శిబిరాలను నిర్వహించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మండల కన్వీనర్‌ సయ్యద్‌ ముస్తాక్‌, మార్కెట్‌ యార్డ్‌ కమిటీ చైర్మన్‌ సుబ్బరామరాజు, ఎస్‌సి కార్పొరేషన్‌ డైరెక్టర్‌ శ్రీనివాసులు, జిల్లా టూరిజం డైరెక్టర్‌ సుధాకర్‌రాజు, తలవాయిపల్లి మాజీసర్పంచ్‌ మల్లికార్జునరెడ్డి, సొసైటీ ఛైర్మన్‌ రంగారెడ్డి, సర్పంచ్‌ వడ్డి రాములమ్మ, చెంగయ్య, ఎంపిటిసి చెంగయ్య, రాజశేఖర్‌రెడ్డి, డిప్యూటీ డిఎంహెచ్‌ఒ శేఖర్‌, వాలంటీర్లు, ఆశా వర్కర్లు, ఎఎన్‌ఎంలు, సిహెచ్‌ ఓలు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. పెనగలూరు : ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ లక్ష్యంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని చేపట్టినట్లు ప్రభుత్వ విప్‌ కొరముట్ల శ్రీనివాసులు తెలిపారు. మండల పరిధిలోని చక్రంపేట మండల ప్రాథమిక పాఠశాలలో జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరంలో పాల్గొన్నారు. గతంలో వైఎస్‌.రాజశేఖ రరెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకువచ్చి ఎంతో మంది పేదల జీవితాల్లో వెలుగులు నింపారని తెలిపారు. కార్యక్రమంలో ఎంపిపి కొండూరు సౌందర్య, జడ్పిటిసి సుబ్బరాయుడు, ఎంపిడిఒ వరప్రసాద్‌, ధనుంజయరెడ్డి, డిటి మురళి, గుడ్ల వీరనారాయణరెడ్డి, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. రైల్వేకోడూరు : మండలం అనంతరాజుపేట-1 గ్రామ సచివాలయ పరిధిలో జరిగిన ''జగనన్న ఆరోగ్య సురక్ష''వైద్య శిబిరంలో ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ పంజం సుకుమార్‌ రెడ్డి, వైస్‌ ఎంపిపి రామిరెడ్డి ధ్వజరెడ్డి, మండల కన్వీనర్‌ సుధాకర్‌రాజు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సుబ్బరామరాజు, జడ్‌పిటిసి రత్నమ్మ, ఉపసర్పంచ్‌ తోట శివ సాయి, ఎంపిటిసిలు పి.జనార్ధనరాజు, బి.మల్లికార్జున, జిల్లా పౌరసరఫరాశాఖ అధికారి రఘురాం, స్థానిక సీనియర్‌ నాయకులు సలాం, వేణుగోపాల్‌రెడ్డి, రామచంద్రయ్య, షఫీ, మణి, అంజి, తహశీల్దార్‌ రామమోహన్‌, డిటి అమరేశ్వరి, వాలంటీర్లు, ఎఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.కలకడ: ప్రతి ఇంటికి వైద్య సేవలు అందించడమే రాష్ట్రప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఎంపిపి శ్రీదేవి రవికుమార్‌ పేర్కొన్నారు. మండలంలోని బాటవారిపల్లి పంచాయతీ బాటవారిపల్లి సచివాలయం పరిధిలో ఉన్న జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమ ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి రవిచం ద్రబాబు, ఎంపిడిఒ పరమేశ్వర్‌రెడ్డి, తహసిల్దార్‌ ప్రదీప్‌, సింగిల్‌ విండో అధ్యక్షులు వెంకటరమణారెడ్డి, పార్టీ కన్వీనర్‌ కమలాకర్‌ రెడ్డి, మెడికల్‌ ఆఫీసర్‌ కిషోర్‌ కుమార్‌ రెడ్డి, మల్లికార్జున రావు, జవహర్‌బాబు, మోహన్‌, మండల సచివాలయ కన్వీనర్‌ మోహన్‌ రాజా,సెక్రటరీ షబానాభాను, శివాజీ, పవన్‌కుమార్‌, సచివాలయ సిబ్బంది, అంగన్వాడీ సూపర్వైజర్‌, అంగన్వాడీ టీచర్స, వాలంటీర్లు, ప్రజాప్రతినిధులు, పాల్గొన్నారు.తంబళ్లపల్లె : గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది. శనివారం బాల్‌రెడ్డిగారిపల్లి పంచాయితీ బలకవారిపల్లి ఉన్నత పాఠశాల ఆవరణంలో ఏర్పాటుచేసిన జగనన్న ఆరోగ్య సురక్ష పథకాన్ని స్పెషల్‌ ఆఫీసర్‌ స్కందప్ప, సర్పంచ్‌ వేణుగోపాల్‌రెడ్డిలు ప్రారంభించారు. కార్యక్రమంలో మెడికల్‌ ఆఫీసర్‌ అనుపమ, డాక్టర్లు మునికుమార్‌, ప్రత్యేక వైద్య నిపుణులు లుమీతిగ్లా, కిరణ్‌లు ప్రజలకు కొన్ని రకాల పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.మదనపల్లె అర్బన్‌: జగనన్న ఆరోగ్య సురక్ష,ప్రజల ఆరోగ్యానికి శ్రీరామరక్ష అని 14వ వార్డు కౌన్సిలర్‌ షేక్‌ షబానా , జిల్లా వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ ఎస్‌.ఏ.కరీముల్లాలు పేర్కొన్నారు. శనివారం మదనపల్లె మునిసిపాలిటీ 14వ వార్డులో విస్తతంగా పర్యటిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే విధంగా ప్రభుత్వం తీసుకొచ్చిన కార్యక్రమంపై అవగాహన కల్పిస్తూ కరపత్రాలు పంచి పెట్టారు. కార్యక్రమంలో సచివాలయం ఏఎన్‌ఎంలు,వార్డు సచివాలయం కన్వినర్లు,గహ సారధులు, వాలంటీర్లు స్థానిక వార్డు ప్రజలు పాల్గొన్నారు. కలికిరి: వైద్య, విద్య, ఆర్థిక పురోగతే ప్రభుత్వ ధ్యేయమని ఎంపీ మిథున్‌రెడ్డి తెలిపారు. శనివారం కలికిరి మేజర్‌ పంచాయతీ కార్యాలయంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఎంపీ మిధున్‌ రెడ్డి, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి లాంచనంగా ప్రారంభించి ప్రభుత్వం చేపట్టిన వైద్యరంగంలో పలు పథకాలులో భాగంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు. పత్తేగడ గ్రామపంచాయతీ నందు ఎంపీ మిధున్‌ రెడ్డి సొంత నిధులతో భూమిని సేకరించి వాటిలో దాదాపు 300 ఇళ్ళ కుటుంబాలకు సరిపడా జగనన్న కాలనీ ఏర్పాటుచేసి ఇల్లు పట్టాలు పంపిణీ చేసి పట్టాలతో పాటు ప్రతి మహిళకు చీరను బహుమతిగా అందించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ జగనన్న కాలనీ ఏర్పాటు చేయడం ఆడపడుచులకు చీరను పంపిణీ చేయడం ఎంతో ఆనందంగా ఉందని అభివద్ధిని చూసి జగనన్న ను మరోసారి సీఎం చేయాలని కోరారు. పార్టీ చూడకుండా కులం చూడకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి జగనన్న కాలనీలో గహము ఏర్పాటు చేయడం జరుగుతుందని ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే తమ దష్టికి తెస్తే వారికి కూడా ఇళ్లను కేటాయిస్తామని తెలిపారు. రైతులకు మోటర్లను అందిస్తా మన్నారు. కార్యక్రమంలో ఎపి మైనార్టీ కమిషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ ఇక్బాల్‌అహ్మద్‌, మాజీ మర్కపెడ్‌ చైర్మన్‌ నల్లారి తిమ్మారెడ్డి, నియోజకవర్గ పరిశీలకు సహదేవరెడ్డి, ఎంపిపి వేంపల్లి నూర్జహాన్‌, జడ్పిటిసి పద్మజ లోకవర్ధన్‌, మండల కన్వీనర్‌ చింతల రమేష్‌ రెడ్డి, ఎంపిడిఒ గంగయ్య యాదవ్‌, తహశీల్దార్‌ భాగ్యలత, కొటాల వైసీపీ నాయకుల వెంకటపతి, ముస్లిం మైనార్టీ యువ నాయకులు వేంపల్లి బావాజీ, వేంపల్లి ఫయాజ్‌, జిల్లా ఎస్సీ సెల్‌ కార్యదర్శి వి. హరి, రెడ్డప్ప, వెంకట్‌రెడ్డి, గంగయ్య, ఎంపిటిసి బోగేష్‌, వార్డ్‌మెంబర్‌ ఖాదర్‌బాషా, విశ్వనాథ, అజరు పాల్గొన్నారు.