Aug 03,2023 22:36

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న దీపిక

ప్రజాశక్తి-హిందూపురం : ప్రభుత్వం చేపట్టిన జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా 98 శాతం సమస్యలను పరిష్కరించామని వైసిపి నియోజక వర్గ సమన్వయ కర్త, ఇన్‌ఛార్జి దీపిక అన్నారు. గురువారం స్థానిక వైసిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. నెల రోజుల పాటు విజయవంతంగా కొనసాగిన జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ప్రతి పౌరుడి సమస్య పరిష్కారమైందన్నారు. ఈ కార్యక్రమం నిర్వహణకు ప్రభుత్వ ఉన్నత అధికారుల దగ్గరి నుంచి సచివాలయ ఉద్యోగుల వరకు అందరు తమ సేవలను సమర్థవంతంగా నేరవేర్చారన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మేల్యే అబ్దుల్‌ ఘనీ, మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ బలరామిరెడ్డి, చిలమత్తూరు ఎంపిపి పురుషోత్తం రెడ్డి, నాయకులు నారాయణ స్వామి, నారాయణ స్వామి, నాగమణి, పెద్ద ఎత్తున వైసిపి నాయకులు పాల్గొన్నారు.