Jun 25,2023 21:53

ఫొటో : మాట్లాడుతున్న జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కూర్మనాధ్‌

'జగనన్న సురక్ష'పై జెసి సర్వే
ప్రజాశక్తి-మర్రిపాడు : మండలంలోని చుంచులూరు సచివాలయంలోని ఎస్‌సి కాలనీలో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కూర్మనాధ్‌ జగనన్న సురక్ష పథకంపై సర్వే నిర్వహించారు. ఈ పథకంపై జరిగే సర్వే గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ పథకం గూర్చి ప్రజలకు వివరించాలన్నారు. జగనన్న సురక్ష పథకం కార్యక్రమం సక్రమంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.
జూలై 1 నుండి జరిగే ఈ కార్యక్రమంలో అర్హులైన ప్రతిఒక్కరికీ అందాల్సిన సంక్షేమ పథకాలను వెంటనే అందిస్తామని పేర్కొన్నారు. ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆయనవెంట తహశీల్దారు ఆనందరావు, సచివాలయ కన్వీనర్‌ విష్ణువర్ధన్‌ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి నరసింహనాయుడు, గ్రామ రెవెన్యూ అధికారి రమణయ్య, గృహ సారథులు, వలంటీర్లు, నాయకులు పాల్గొన్నారు.