Jun 23,2023 23:48

మాట్లాడుతున్న శాంతారామ్‌

ప్రజాశక్తి-గొలుగొండ: మండలంలోని సిహెచ్‌. నాగాపురం గ్రామ సచివాలయంలో శుక్రవారం జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కన్వీనర్‌ పాణి శాంతారామ్‌ మాట్లాడుతూ, గ్రామాల్లో వివాహ సర్టిఫికెట్‌, కుల, ఆదాయ, మరణ ధృవపత్రం, తల్లిదండ్రులు భూములను పిల్లలకు ఇచ్చే వీలుగా మ్యుటేషన్లు వంటి 11 రకాల సేవలకు టోకెన్లు ఇస్తారన్నారు. ఈ కార్యక్రమంలో సిహెచ్‌.నాగాపురం సర్పంచ్‌ యలమంచిలి రఘురామ్‌, తదితరులు పాల్గొన్నారు.