శ్రీకాకుళం అర్బన్ : పార్టీలకతీతంగా సిఎం జగన్ సంక్షేమ పథకాలు అందిస్తున్నారని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. నగరంలోని వైఎస్‌ఆర్ కళ్యాణ మండపంలో నిర్వహించిన జగనన్న సురక్షలో పాల్గొని మాట్లాడారు. సిఎం ఇచ్చిన మాటకు కట్టుబడి రుణాలతో పాటు వడ్డీ ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నారని అన్నారు. నగరంలోని పెద్ద మార్కెట్ రూపు రేఖలను పూర్తిగా మర్చేశామన్నారు. రిమ్స్‌లో 900 బెడ్స్ అందుబాటులోకి తీసుకొచ్చామని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ అధికారి వెంకటరావు, మాజీ కౌన్సిలర్ పిల్లల నీలాద్రి, అర్జున్‌రెడ్డి, చిన్నబాబు, ఖాన్, భానుప్రసాద్, అశిరినాయుడు, పొన్నాడ రిషి, భాస్కరరావు పాల్గొన్నారు.
పలాస : రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు నిలిచిపోతాయని పశువర్థకశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. మండలంలోని చినంచలలో నిర్వహించిన జగనన్న సురక్షలో పాల్గొని మాట్లాడారు. వైసిపి ప్రభుత్వం దేశానికే ఆదర్శమన్నారు. కంబిరిగాం కూడలి నుంచి పెదంచల వరకు బిటి రోడ్డు పున:నిర్మాణానికి టెండరు ప్రక్రియ పూర్తయిందన్నారు. పాఠశాలను నాడు-నేడు పథకం కింద అభివృద్ది చేస్తామని అన్నారు. అనంతరం 11 రకాల ధ్రువపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఎసిఎస్ అధ్యక్షులు పైల వెంకటరావు చిట్టి, ఎంపిపి ప్రతినిధి ఉంగ సాయికృష్ణ, వ్యవసాయ అభివృద్ధి కమిటీ చైర్మన్ జి.వేణుగోపాల్, సర్పంచ్ ప్రతినిధి కంచరాన భాస్కరరావు, ఎంపిడిఒ ఎన్.రమేష్‌నాయుడు, డిటి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
కోటబొమ్మాళి: మండలంలోని మాసాహెబ్‌పేట సచివాలయం వద్ద సర్పంచ్ సంపతిరావు ధనలక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన జగనన్న సురక్షలో ఎంపిడిఒ కె.ఫణీంద్రకుమార్, కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ సంపతిరావు హేమసుందరరాజు, తాటిపర్తి సర్పంచ్ రెడ్డి లక్ష్మణ్, మండల ప్రత్యేకాధికారి మంద లోకనాథం, డిటి ఆర్.మధు, పంచాయతీరాజ్ జెఇ లతశ్రీ, ఆర్‌డబ్ల్యూఎస్ జెఇ కావ్యశ్రీ, హౌసింగ్ ఎఇ రెడ్డి పాపినాయుడు, పేడాడ వెంకటరావు పాల్గొన్నారు.
మెళియాపుట్టి : మండలంలోని వసుంధరలో నిర్వహించిన జగనన్న సురక్షలో ఎమ్మెల్యే రెడ్డి శాంతి పాల్గొని 11 రకాల ధ్రువపత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో తహశీల్దార్ పి.సరోజని, ఎంపిడిఒ పి.చంద్రకుమారి, ఎంఇఒ ఎస్.దేవేందరరావు, ఇఒపిఆర్‌డి తారకేశ్వరి, మండల ఎఒ దానకర్ణుడు, ఎపిఎం లలిత పాల్గొన్నారు.
నందిగాం : మండలంలోని పెద్దతామరాపల్లిలో సర్పంచ్ తమిరి దేవేంద్రరావు అధ్యక్షతన నిర్వహించిన జగనన్న సురక్షలో కళింగ కార్పొరేషన్ చైర్మన్ పేరాడ తిలక్, నియోజకవర్గ ఇన్‌ఛార్జి దువ్వాడ వాణి పాల్గొని 11 రకాల ధ్రువపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఎంపిపి నడుపూరు శ్రీరామ్మూర్తి, పిఎసిఎస్ అధ్యక్షులు కురుమాన బాలకృష్ణారావు, మండల ప్రత్యేక అధికారి మురళీకృష్ణ, ఎంపిడిఒ జి.శివప్రసాద్, డిటి ఎన్.భాగ్యలక్షి, మండల ఎఒ శ్రీకాంత్‌వర్మ పాల్గొన్నారు.
వజ్రపుకొత్తూరు : మండలంలోని నగరంపళ్లిలో సర్పంచ్ దువ్వాడ పద్మావతి అధ్యక్షతన నిర్వహించిన జగనన్న సురక్షలో ఎంపిపి ప్రతినిధి ఉప్పరపెల్లి ఉదరుకుమార్ పాల్గొని 11 రకాల ధ్రువపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో తహశీల్దార్ బి.అప్పలస్వామి, ఎంపిటిసి ప్రతినిధి బి.మోహనరావు, మామిడి గోవిందరావు పాల్గొన్నారు.
పోలాకి: మండలంలోని గొల్లలవలస, దీర్ఘాశిలో నిర్వహించిన జనగన్న సురక్షలో జెడ్‌పిటిసి ధర్మాన కృష్ణచైతన్య పాల్గొని వివిధ రకాల ధ్రువపత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో ఎంపిపి ప్రతినిధి ముద్దాడ భైరాగినాయుడు, సర్పంచ్ ప్రతినిధి పి.జగన్, ఎంపిటిసి ప్రతినిధి సూరపు జయరాం, వైసిపి నాయకులు ఆర్.త్రినాథరావు, కణితి సత్తిబాబు పాల్గొన్నారు.










