Jun 23,2023 20:00

సమావేశంలో మాట్లాడుతున్న ఎంపిపి

జగనన్న సురక్షను విజయవంతం చేయండి : ఎంపిపి
ప్రజాశక్తి - చాగలమర్రి

ప్రభుత్వం చేపట్టనున్న జగనన్న సురక్ష పథకాన్ని విజయవంతం చేయాలని ఎంపిపి రామిశెట్టి వీరభద్రుడు కోరారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయ సమావేశ భవనంలో ఎంపీపీ అధ్యక్షుతన మండల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు,సచివాలయాల సిబ్బంది, వాలంటీర్లతో జగనన్న సురక్ష పథకంపై అవగాహన కల్పించారు. గడపగడపకు వెళ్ళి వారికి అవసరమైన జనన,మరణ,వివాహ, తదితర 11 రకాల ధృవపత్రాలను ఉచితంగా ఇవ్వడం జరుగుతుందన్నారు. కార్యక్రమ ంలో ఎంపిడిఓ మహబూబ్‌ దౌలా,తహసిల్దార్‌ విజరు కుమార్‌,ఏఓ రంగ నేతాజీ,ఇన్‌చార్జ్‌ ఈఓఆర్‌డి సుదర్శన్‌ రావు,ఎంఎల్‌ఓ హరికృష్ణ, పంచా యతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.
పగిడ్యాల: జగనన్న సురక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీడీవో వెంకటరమణ, ఎంపీపీ మండ్ల మల్లేశ్వరి అన్నారు. శుక్రవారం జగనన్న సురక్ష కార్యక్రమంపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్లో నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడారు. జగనన్న సురక్ష కార్యక్ర మాన్ని ప్రజా ప్రతినిధులు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, గృహ సారధులు వార్డు మెంబర్లు గ్రామాలలో ఇంటింటా తిరిగి ప్రభుత్వ అమలు చేసిన సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని ప్రజలని అడిగి తెలుసుకోవాలన్నారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
ఆత్మకూరు: మండల పరిషత్‌ కార్యాలయం నందు శుక్రవారం నాడు ఎంపిడిఓ మోహన్‌ కుమార్‌, తాసిల్దార్‌ ఉమారాణి అధ్యక్షతన జగనన్న సురక్ష కార్యక్రమంపై గ్రామ సచివాలయం సచివాలయం సిబ్బందికి, గ్రామ వాలంటీర్స్‌కు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమము ఏవో మోహన్‌ కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.
పాములపాడు: మండలంలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీడీవో గోపికృష్ణ, తహశీల్దార్‌ రత్న రాధిక కోరారు. ఎంపీడీవో కార్యాలయం నందు డిజిటల్‌, వెల్ఫేర్‌ అసిస్టెంట్లకు పంచాయతీ కార్యదర్శులు విఆర్వోలు వాలంటీర్లకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఈఓఆర్డి శ్రీనివాస్‌ నాయుడు, తదితరులు పాల్గొన్నారు.
బండి ఆత్మకూర్‌: మాట్లాడుతున్న ఎంపీపీ డి చిన్న సంజీవరెడ్డి
బండి ఆత్మకూర్‌: అర్హులైన లబ్ధిదారులందరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలని మండల ప్రజా పరిషత్‌ అధ్యక్షులు దే రెడ్డి చిన్న సంజీవరెడ్డి అన్నారు. మండల ప్రజా పరిషత్‌ సమావేశంలో జగనన్న సురక్ష కార్యక్రమ ంపై పంచాయతీ కార్యదర్శులకు, వీఆర్వోలకు, సచివాలయ సిబ్బందికి, గృహసారథులు, కన్వీనర్లు, వాలంటీర్లకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వాసుదేవగుప్త, డిప్యూటీ తాసిల్దార్‌ హరిత, జెసిఎస్‌ కన్వీనర్‌ పుల్లారెడ్డి, మండల కన్వీనర్‌ పార్థసారథి పాల్గొన్నారు.