ప్రజాశక్తి - దేవనకొండ
'జగనన్న సురక్ష' కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైసిపి మండల ఇన్‌ఛార్జీ రాజా రెడ్డి, జడ్‌పిటిసి కిట్టు, వైసిపి మండల కన్వీనర్ కప్పట్రాళ్ల మల్లికార్జున కోరారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయ సమావేశ భవనంలో ఎంఎల్‌ఒ జగన్ అధ్యక్షతన సచివాలయ కన్వీనర్లు, వాలంటీర్లు, గృహ సారథులకు 'జగనన్న సురక్ష'పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 'జగనన్న సురక్ష' ద్వారా ప్రతి ఇంటికీ కన్వీనర్లు, గృహ సారథులతో కలిసి వాలంటీర్లు తిరుగుతూ యాప్‌లో పొందుపరిచిన పశ్నలకు లబ్ధిదారుల నుంచి సమాధానాలు సేకరించాలని తెలిపారు. అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందేలా చూడాలని, నిర్ణయించిన తేదీలో అధికారుల సమక్షంలో అర్హత కలిగిన వారికి పత్రాలు అందజేస్తామని చెప్పారు. సచివాలయ కార్యదర్శులు అబ్దుల్ రహీం, రిబిక, నరసప్ప, యూసుఫ్ బాష, పెద్ద నరసింహులు, పల్లెదొడ్డి చంద్రన్న, రామాంజనేయులు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న వైసిపి మండల ఇన్‌ఛార్జీ రాజారెడ్డి










