ప్రజాశక్తి - జీలుగుమిల్లి
ప్రజలందరూ జగనన్నసురక్ష కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపిపి కొర్స.పోసమ్మ తెలిపారు. సోమవారం రాచన్న గూడెం పంచాయతిలో ఏర్పాటు చేసిన జగనన్న సురక్షలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్టీలకతీతంగా అర్హులైన ప్రతిఒక్కరికీ సంక్షేమ పథకాలు సేవలందించడమే జగనన్న సురక్ష లక్ష్యమన్నారు. అర్హులైన ప్రతిఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పిటిసి వసంతరావు, తహశీల్దార్ సుందర్ సింగ్, ఎంపిడిఒ కృష్ణప్రసాద్, సచివాలయం కన్వీనర్ వనమా రామకృష్ణ, సర్పంచి సున్నం. వరలక్ష్మి, సంధా.ప్రసాద్ పాల్గొన్నారు
ఏలూరుటౌన్: దెందులూరు మండలంలోని జోగన్నపాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని దెందులూరు ఎంఎల్‌ఎ కొఠారు అబ్బయ్య చౌదరి ప్రారంభించారు. జెడ్‌పి ఛైర్మన్ ఘంటా పద్మశ్రీప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన ''జగనన్న సురక్ష'' కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధ్యక్షులు, సొసైటీ అధ్యక్షులు వైసిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు.
భీమడోలు: జగనన్న సురక్ష కార్యక్రమంలో ఉంగుటూరు ఎంఎల్‌ఎ పుప్పాల వాసుబాబు పాల్గొని బటన్ నొక్కగానే అర్హులైన లబ్ధిదారులకు అవసరమైన డాక్యుమెంట్లు, సర్టిఫికెట్లు జాప్యం లేకుండా ఉచితంగా అందుతాయని తెలిపారు. పొలసానిపల్లి గ్రామ సచివాలయ పరిధిలో బుధవారం గ్రామ సర్పంచి షేక్ రహీమా బేగం హసేన అధ్యక్షతన జగనన్న సురక్షను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎంఎల్‌ఎ మాట్లాడుతూ సాధారణంగా ఎన్నికలకు ముందు ప్రతిపక్షాలు సంక్షేమ పథకాలు ప్రకటించి వాటిలో కొన్నింటిని మాత్రమే అమలు చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్‌పిటిసి సభ్యురాలు తుమ్మగుంటి భవానిరంగా, సర్పంచిల చాంబర్ అధ్యక్షురాలు సునీత మాన్సింగ్, ఎఎంసి ఛైర్‌పర్సన్ ఇంజెట్టి నీలిమ జూనియర్ పాల్గొన్నారు.
చింతలపూడి: అర్హత ఉండీ నిర్దేశించిన ధృవీకరణ పత్రాలు లేని కారణంగా కొంతమంది ప్రజలు సంక్షేమ కార్యక్రమాలు పొందలేకపోతున్నారని చింతలపూడి ఎఎంసి ఛైర్మన్ జగ్గవరపు జానాకిరెడ్డి, సర్పంచి తుల్లిమిల్లి రాణి తెలిపారు. అర్హత కలిగిన ఏ ఒక్కరూ మిగిలిపోకూడదన్న ఉద్దేశ్యంతో ధృవీకరణ పత్రాలను లబ్ధిదారుల ఇంటికే ఉచితంగా అందించేందుకు 'జగనన్నసురక్ష' కార్యక్రమం ప్రభుత్వం నిర్వహిస్తుందన్నారు. చింతలపూడి మండలం యర్రగుంటపల్లి 1 సంచివాలయం పరిధిలో జగనన్న సురక్ష కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి రాంబాబు, జడ్‌పిటిసి మోలుగుమాటీ నీరజసుధాకర్, కుటుంబరావు, ప్రసాద్, తహశీల్దార్ కృష్ణజ్యోతి, ఇఒపిఆర్‌డి విక్టర్ ప్రసాద్, ప్రముఖ వైసిపి నాయకులు పాల్గొన్నారు.
ముసునూరు: సంక్షేమ పథకాలు అందరికీ అందేలా చేయడమే జగనన్న సురక్ష కార్యక్రమం ముఖ్య లక్ష్యమని నూజివీడు ఎంఎల్‌ఎ మేకా వెంకటప్రతాఫ్ అప్పారావు అన్నారు. బుధవారం గుళ్లపూడి గ్రామంలో జగనన్న సురక్ష కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఎంపిడిఒ జి.రాణీ ఆధ్వర్యంలో 1197 రకాల డాక్యుమెంట్ల్ గ్రామస్తులకు అందచేశారు. ఈ కార్యక్రమంలో జడ్‌పిటిసి డాక్టరేట్ ప్రతాఫ్, వైస్ ఎంపిపి కోటగిరిరాజానాయన, సర్పంచి రాజబోయిన శ్రీదేవి పాల్గొన్నారు.
టి.నరసాపురం: సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జగనన్న సురక్ష కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జడ్‌పిటిసి సభ్యులు సామంతపూడి బాల సూర్యనారాయణరాజు(సూరిబాబు) అన్నారు. మండలంలోని రాజుపోతేపల్లిలో బుధవారం నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో పాల్గొన్న సూరిబాబు పలు రకాల సర్టిఫికెట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ బొంతు రమాదేవి, జిల్లా రైతుసంఘం అద్యక్షులు వాసిరెడ్డి మధు, శ్రీనురాజు, ఉమ్మడి తేజ, అంజిబాబు పాల్గొన్నారు.
పోలవరం: ప్రగడపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో పాల్గొన్న ఏలూరు జిల్లా ఎంపిపిల సంఘం అధ్యక్షులు పోలవరం ఎంపిపి సుంకర వెంకటరెడ్డి మాట్లాడుతూ జగనన్న సురక్షను ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ముఖ్యఅతిథిలుగా ఎంపిడిఒ జి.శ్రీను, ఎంఆర్‌ఒ బి.సుమతి, జడ్‌పిటిసి కులుం హేమకుమారి, ప్రగడపల్లి సర్పంచి కలుం బాపిరాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపిపి మీడియం సింగరాజు, ఎంపిటిసి దాపర్తి మోహనరావు, ప్రజలు పాల్గొన్నారు.
ఆగిరిపల్లి: గ్రామాల్లో మౌలికవసతులు ఏర్పాటు చేయటమే థ్యేయంగా జగనన్న ప్రభుత్వం పనిచేస్తుందని, నూజివీడు నియోజకవర్గ ఎంఎల్‌ఎ మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అన్నారు. మండల పరిధిలోని కృష్ణవరం గ్రామంలో బుధవారం ఆయన త్రాగునీటి పైప్‌లైన్, సిసి రోడ్డును ప్రారంబోత్సవాలు చేయడంతో పాటు, అంగన్‌వాడీ భవనం నిర్మాణం, మల్టీపర్సస్ హాల్, నిర్మాణ పనులకు శంఖుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి కమ్మిలి జ్యోతి, జడ్‌పిటిసి పి.వీరబాబు, ఎంపిపి జి.అనూష, మండల ప్రత్యేకాధికారి పి.వెంకటరత్నం, తహాశీల్దార్ ఎం.ఉదయభాస్కరరావు, ఎంపిడిఒ పి.శంకరరావు, వైసిపి నాయకులు నరశింహారావు, రాంబాబు, హరిబాబు, సుబ్బయ్యలు పాల్గొన్నారు.
ప్రజలకు మరింత చేరువలో సేవలు
ముదినేపల్లి: ప్రజలకు మరింత చెరువులో ప్రభుత్వ సేవలను అందించాలనే లక్ష్యంతో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఎంఎల్‌ఎ దూల నాగేశ్వరరావు అన్నారు. మండలంలోని చిగురుకోటలో సచివాలయం వద్ద బుధవారం జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన డిఎన్‌ఆర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వ సేవలను నేరుగా, పారదర్శకంగా అందించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి రామిశెట్టి సత్యనారాయణ, రాష్ట్ర హౌసింగ్ కార్పోరేషన్ డైరెక్టర్ గంటా సంధ్య, వైస్ ఎంపిపి రాచూరి రాధా, గ్రామ ఎపిటిసి పేరం లక్ష్మి పాల్గొన్నారు.
మండవల్లి: మండలంలోని లోకుముడి సచివాలయ పరిధిలో నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో కైకలూరు ఎంఎల్‌ఎ దూలం నాగేశ్వరావు పాల్గొని మాట్లాడారు. జగనన్న సరక్షను అందరూ వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి పెద్దిరెడ్డి శ్రీరామ దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.
బుట్టాయగూడెం: దొర మామిడి సచివాలయం 2, పరిధి తెల్లవారిగూడెంలో జగనన్న సురక్ష క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పోలవరం ఎంఎల్‌ఎ తెల్లం బాలరాజు, గిరిజన శాఖా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పిడికి రాజన్నదొర పాల్గున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి కారం శాంతి, జడ్‌పిటిసి మొడియం రామతులసి, సొసైటీ అధ్యక్షులు పాల్గొన్నారు.










