Jul 09,2023 21:13

గ్రామస్తులతో మాట్లాడుతున్న జమ్మాన ప్రసన్నకుమార్‌

ప్రజాశక్తి- పార్వతీపురం రూరల్‌ :  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర టిడ్కో చైర్మన్‌ జమ్మాన ప్రసన్నకుమార్‌ అన్నారు. మండలంలోని గిరిజన గ్రామాలైన ములగ, పిండిలోవ, వెలగవలస ఆదివారం జరిగిన గ్రామసందర్శన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అర్హులై ఉండి ఎవరైనా సంక్షేమ పథకాలు అందని ప్రజలకు సమస్యల పరిష్కారానికి ఈ క్రమం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరికీ సొంత ఇంటి కల నిజం చేసుకోవాలని, ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం కావాల్సినా తన దృష్టికి తీసుకొని వస్తే వాటిని తప్పక ప్రభుత్వ పెద్దల సహాయంతో వాటిని పరిష్కరించేందుకు తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని లబ్ధిదారులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పలువురు సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.