ప్రజాశక్తి-విఆర్.పురం
జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని జెడ్‌పిటిసి వాళ్ల రంగారెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని ఒడ్డుగూడెం, విఆర్.పురం గ్రామాల్లో జరిగిన జగనన్న సురక్ష గ్రామసభలు జెడ్‌పిటిసితో పాటు తహశీల్దారు ఎన్.శ్రీధర్, ఎంపీడీఓ ఎం.రత్నకుమారి, వైస్ ఎంపీపీ భవాని, సర్పంచ్ సోడి నరసమ్మ, ఎంపీటీసీ బంధం విజయలక్ష్మి చేతుల మీదుగా పలు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేకాధికారి సుజాత, సెక్రటరీ స్వరూపరెడ్డి, రేకపల్లి సెక్రటరీ శివప్రసాద్, చిక్కాల బాలు, జెసిఎస్ కన్వీనర్ బి. సత్యనారాయణ, ముత్యాల శ్రీను, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
సీలేరు : జికె.వీధి మండలం సీలేరులో మంగళవారం నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమానికి ఎంపీడీవో ఉమామహేశ్వరరావు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సీలేరు సచివాలయం పరిధిలో 996 దరఖాస్తులు వచ్చాయని, ఇందులో 125 సర్టిఫికెట్లు మంగళవారం జారీ చేశామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపిటిసి పిల్ల సాంబమూర్తి, ఇన్‌ఛార్జి సర్పంచ్ కె.వల్లి ప్రసాద్, డిప్యూటీ తహశీల్దారు కుమారస్వామి, ఏఈ జ్యోతి బాబు, ఏపీవో రాంప్రసాద్, ఆర్‌ఐ మహదేవు, కార్యదర్శి శ్రీనివాస్ పాల్గొన్నారు.
రంపచోడవరం : మండలంలోని ముసురిమిల్లిలో సర్పంచ్ కోసు రమేష్ బాబు అధ్యక్షతన జరిగిన గ్రామసభలో ఎంపీటీసీ సభ్యులు వంశి కుంజం, వార్డ్ మెంబర్లు సరస్వతి, ప్రభావతి, జ్యోతి, పండు, సచివాలయం కన్వీనర్ కుంజం నాగమణి, వైసిపి నాయకులు బోబ్బా శేఖర్, బాలు రెడ్డి, కారం సంకురు, సింధు, విక అబ్బులు, పంచాయతీ కార్యదర్శి నాగమణి, విఆర్వో ప్రభ, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.










