Jun 23,2023 19:26

ముఖ్యమంత్రి సందేశాన్ని వింటున్న అధికారులు

ప్రజాశక్తి - నందవరం
ఏ కారణం చేతనైనా అర్హత ఉండి మిగిలిపోయిన వారికి పథకాల ద్వారా లబ్ధి చేకూర్చేందుకు అన్ని శాఖల అధికారులు కలిసి పని చేయాలని మండల అధికారులు తెలిపారు. శుక్రవారం నందవరంలోని సచివాలయం-3లో 'జగనన్న సురక్ష'ను అధికారులు వీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మండలంలోని సచివాలయాల పరిధిలో నెలరోజుల పాటు 'జగనన్న సురక్ష' కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. అర్హత ఉండి పథకాలు పొందని వారికి పథకాల ద్వారా లబ్ధి చేకూర్చేలా అధికారులు కృషి చేయాలన్నారు. తహశీల్దార్‌ నిత్యానంద రాజు, ఎంపిడిఒ దశరథ రామయ్య, ఎంఇఒ సుదర్శన్‌ రెడ్డి, ఇఒఆర్‌డి ఈశ్వరయ్య స్వామి, ఎపిఎం వీరన్న, సర్పంచి సావిత్రి, వైసిపి మండల నాయకులు శివారెడ్డి గౌడ్‌, జడ్‌పిటిసి నిఖిల్‌ చక్రవర్తి, కార్యదర్శి రంగనాయకులు పాల్గొన్నారు.