Jun 27,2023 22:05

ఫొటో : మాట్లాడుతున్న ఎంపిడిఒ ఐజాక్‌ప్రవీణ్‌

'జగనన్న సురక్ష'ను పూర్తి చేయాలి
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : మండలంలోని బోయల చిరివెళ్ల గ్రామం సచివాలయ పరిధిలో గ్రామ వలంటీర్లతో జగనన్న సురక్ష కుటుంబాల సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో ఎంపిడిఒ పి.ఐజాక్‌ప్రవీణ్‌ జగనన్న సురక్ష కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఎంపిడిఒ మాట్లాడుతూ 100 శాతం సర్వే పూర్తి చేయాలని వలంటీర్లుకు సూచనలు జారీ చేశారు.
జగనన్న సురక్ష కార్యక్రమము సంబంధించి ప్రభుత్వము వారు అందజేసే ఉచిత సేవలు ప్రజలు వినియోగించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో తహశీల్దార్‌ లక్ష్మీ నరసింహ, సర్పంచ్‌ బొలిగెర్ల వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శి అంకయ్య తదితరులున్నారు.