Jun 27,2023 00:43

మాట్లాడుతున్న జిల్లా అడిట్‌ అధికారిని సువర్ణ పణి

ప్రజాశక్తి-పెదబయలు:స్థానిక రెసిడెన్సీయల్‌ పాఠశాల లోని సమావేశం మందిరంలో సోమవారం ఎంపీడీఓ ఎల్‌.పూర్ణయ్య ఆధ్వర్యంలో జగనన్న సురక్షపై సచివాలయం సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన జిల్లా అడిట్‌ అధికారిని సువర్ణ పణి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న సురక్షను జయప్రదం చేయాలని కోరారు. ప్రతి గ్రామ సచివాలయంలో ప్రత్యేక క్యాంపు నిర్వహించడం జరుగుతుందన్నారు. గ్రామ వాలంటీర్స్‌ సమస్యలను యాప్‌లో నమోదు చేస్తారని తెలిపారు. దీనిలో భాగంగా టోకెన్‌ జన రేటర్‌ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఎల్‌.పూర్ణయ్య, తహసీల్దార్‌ నరసింగరావు పాల్గొన్నారు.