Jun 20,2023 00:14

నర్సీపట్నంలో మాట్లాడుతున్న ఆర్‌డి జయరాం

ప్రజాశక్తి-నర్సీపట్నంటౌన్‌:జూలై 1 నుండి ప్రారంభిం చనున్న జగనన్న సురక్ష పథకంను జయప్రదం చేయాలని స్పెషల్‌ ఆఫీసర్‌, ఆర్డిఓ సిహెచ్‌ జయరాం కోరారు. ఎంపిడిఓ కార్యాలయంలో సమీక్ష సమావేశాన్ని ఎంపిడిఓ జయ మాధవి అధ్యక్షత సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో జయరాం మాట్లాడుతూ జగనన్న సురక్ష పథకాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్ళేందుకు సచివాలయ కన్వీనర్లు, ఎఫ్‌ఏఓలు, ఎంఎల్వోలు కృషి చేయాలని కోరారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదో తెలుసుకోవాల్సి ఉందన్నారు. కుల, ఆదాయ, జనన, మరణ, వివాహ పత్రాలు అందించేందుకు గుర్తించాలన్నారు. మ్యుటేషన్‌ లావాదేవీలు, ఆధార్‌ ఫోన్‌ నెంబర్‌ అనుసంధానము, పంట సాగు హక్కు కార్డులకు గుర్తించాలన్నారు. ఓటర్‌ లిస్ట్‌ లో జనన, మరణాలు, ప్రతి ఇంట్లో అందరూ ఓటు హక్కును కలిగి ఉన్నారా లేదా వంటి వాటిని క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్‌ అన్నాజీరావు, పంచాయతీ సెక్రటరీలు, వీఆర్వోలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
నక్కపల్లి:జగనన్న సురక్షపై మండల పరిషత్‌ సమావేశ మందిరంలో ఎంపీపీ రత్నం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. తహసీల్దార్‌ అంబేద్కర్‌, ఎంపీడీవో సీతారామరాజు జగనన్న సురక్ష విధివిధానాలను వివరించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్‌ ఉపాధ్యక్షులు వీసం నానాజీ, వెలగా ఈశ్వరరావు, ఈఓపిఆర్‌డి వెంకటనారాయణ పాల్గొన్నారు .
కోటవురట్ల:జగనన్న సురక్షపై మండల సమావేశం మందిరంలో ఎంపీడీవో కాశీ విశ్వనాథరావు, తహసిల్దారు జానకమ్మ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పిఓపిఆర్డి సుబ్రహ్మణ్యం, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు..