ప్రజాశక్తి - యంత్రాంగం జిల్లాలోని పలుకేంద్రాల్లో గురువారం జగనన్న సురక్ష సభలు నిర్వహించారు. అర్హులైన లబ్ధిధారులకు పలు ధ్రువపత్రాలు అందించారు. జగ్గంపేట రూరల్ వైసిపి సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఒమ్మి రఘురామ్ మర్రిపాకలో జగతం ఆంజనేయులు అధ్యక్షతన జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంపిడిఒ వసంతకుమార్, పైల శివరామకష్ణ, సతీష్ పాల్గొన్నారు. తాళ్లరేవు చిన్న వలసలలో గాడిమొగ సర్పంచ్ కామాడి గోవలక్ష్మి అధ్యక్షతన సభలో ఎంపిడిఒ ఎం.అనుపమ, జెడ్‌పిటిసి దొమ్మేటి సామ్యూల్ సాగర్, కామాడి మాతరాజు, అంకాడి అంజి బాబు, వినకోటి రామకష్ణ విఆర్‌ఒ అర్జున్, పంచాయతీ కార్యదర్శి రమణ పాల్గొన్నారు. ఏలేశ్వరం 2, 12వ వార్డుల్లో నగర చైర్‌పర్సన్ అలమండ సత్యవతి, కౌన్సిలర్ అలమండ చలమయ్య, శిడగం వెంకటేశ్వరరావు, దళే కిషోర్, సామంతుల హైమావతి, జువ్వుని వీర్రాజు, మసిరపు బుజ్జి, కె.రమణ, కమిషనర్ కెఎ.కొండలరావు, మేనేజర్ శ్రీనివాసరావు, జెడి ఆనంద్, శ్రీనివాసరావు పాల్గొన్నారు. రౌతులపూడి 2వ సచివాలయంలో ఎంపిడిం ఎం.గోవిందు, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ జి.రమణమ్మ, జెడ్‌పిటిసి గొల్లు లక్ష్మణమూర్తి, సర్పంచ్ అర్జమ్మ, ఉప సర్పంచ్ భాస్కర్ బాబు పాల్గొన్నారు. కాజులూరులో జెడ్‌పిటిసి వనుం వెంకట సుబ్బారావు, సర్పంచ్ భాస్కరరావు, తహశీల్దారు సత్యనారాయణ, ఎంపిడిఒ రత్నరాజ్, ఎంపిటిసి సభ్యుడు మేడిశెట్టి శ్రీను, కృష్ణారెడ్డి, హేమాదేవి పాల్గొన్నారు. పెద్దాపురం పులిమేరులో హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవులూరు దొరబాబు, ఎంపిడిఒ అశోక్ కుమార్, జెడ్‌పిటిసి గవరసాన సూరిబాబు, మున్సిపల్ వైస్ చైర్మన్ నెక్కంటి సాయి ప్రసాద్, వైస్ ఎంపిపి మిరియాల రాజా, ఎఎంసి వైస్ చైర్మన్ బండారు వీరబాబు, కంటే వీర రాఘవరావు, ఆవాల లక్ష్మీనారాయణ, నాగబోయిన రాజబాబు, బోనాసు గుర్రాజు, తుమ్మల అచ్యుతరామయ్య, పళ గంగారావు పాల్గొన్నారు. సామర్లకోట రూరల్ ఎంపిపి బొబ్బరాడ సత్తిబాబు, ఎంపిడిఒ డి.శ్రీలలిత, ఇఒపిఆర్‌డి కర్రి హరికృష్ణ సత్యారెడ్డి పాల్గొన్నారు.










