ప్రజాశక్తి-యంత్రాంగం జిల్లాలోని పలుచోట్ల బుధవారం నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో పలువురికి ధ్రువపత్రాలు పంపిణీ చేశారు. రౌతులపూడి మండలంలోని పారుపాకలో ఎంపిడిఒ గోవింద్ ఆధ్వర్యంలో జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ జిగిరెడ్డి రమణమ్మ, సర్పంచ్ పక్కుర్తి లక్ష్మి హాజరయ్యారు. పెద్దాపురం మండలం వడ్లమూరులో హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవులూరి దొరబాబు లబ్ధిదారులకు సర్టిఫికెట్లు, ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశారు. కంటే వీరరాఘవరావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో తహశీల్దారు జితేంద్ర, జెడ్‌పిటిసి గవరసాన సూరిబాబు, ఎంపిపి పెంకే సత్యవతి, వైస్ ఎంపిపిపి కంటే ప్రభావతి, మిరియాల లోవరాజు, వైసిపి నాయకులు నల్లల గోవిందు, రాజబాబు, వీరవరెడ్డి నాని, కామన రామకష్ణ, నరాల శెట్టి త్రినాథ్, పంచాయతీ కార్యదర్శి కళ, విఆర్‌ఒ అక్షరు, పాల్గొన్నారు. తాళ్లరేవు మండలం పి.మల్లవరం సచి వాలయం-2 పరిధిలోని పత్తిగొందిలో సర్పంచ్ దున్నా సత్య నారాయణ అధ్యక్షతన జరగిన కార్యక్రమంలో మాజీ జెడ్‌పి చైర్మన్ దున్నా జనార్దన రావు, ముమ్మిడివరం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుపూడి శివన్నారాయణ, ఎంపిపి రాయుడు సునీత, వైస్ ఎంపిపి ధూళిపూడి బాబి, ఉపసర్పంచ్ పంపన రామకృష్ణ, సచివాలయాల మండల కన్వీనర్ దున్నా శ్రీకాంత్ పాల్గొన్నారు. 600 మంది దరఖాస్తుదారులకు సర్టిఫికెట్స్ అందజేశారు. రాయుడు గంగాధర్, దున్నా రాంబాబు, పిల్లి వీరనాగు, ఇఒపిఆర్‌డి మల్లాడి భైరవమూర్తి, డిటి ఎస్.సూరిబాబు పాల్గొన్నారు. సామర్లకోట రూరల్ అల్లంవారి వీధి, నవర గ్రామాల్లో జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమాల్లో హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవులూరి దొరబాబు మాట్లాడారు.










