ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
'జగనన్న సురక్ష'కు అపూర్వ స్పందన లభిస్తోందని వైసిపి సీనియర్ నాయకులు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి తెలిపారు. మంగళవారం పట్టణంలోని 4, 6వ వార్డులకు సంబంధించిన లబ్ధిదారుల సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం 'జగనన్న సురక్ష'ను రాష్ట్రవ్యాప్తంగా 91 నియోజకవర్గాల్లో నిర్వహిస్తోందని తెలిపారు. నాయకులు, కౌన్సిలర్లు, ఇన్‌ఛార్జీలు పాల్గొన్నారు. హాలహర్వి మండలం కామినహల్ గ్రామం సచివాలయంలో ఎంపిడిఒ ఆంథోని అధ్యక్షతన 'జగనన్న సురక్ష' నిర్వహించారు. లబ్ధిదారులకు కుల ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. తహశీల్దార్ మల్లికార్జున, డిటి జి.లక్ష్మి, పంచాయతీ సెక్రటరీ ఈరన్న, సొసైటీ ఛైర్మన్ సీనప్ప, సర్పంచి జనార్ధన్, మేదేహల్ ప్రహ్లాద్ గౌడ్, సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ రోషన్ వలీ, ఇంజినీరింగ్ అసిస్టెంట్ చంద్రబాబు, సర్వేయర్ సూరి, అగ్రికల్చర్ అసిస్టెంట్ సూరన్న, వాలంటీరు రెహమాన్, శ్రీధర్ పాల్గొన్నారు.
ధ్రువపత్రాలను అందజేస్తున్న జగన్మోహన్ రెడ్డి










