Oct 13,2023 19:27

సినిమా పాటలు వింటూ సరదాగా ముచ్చట్లాడుకుంటున్న అధికారులు, పాలకులు

జగనన్న సురక్ష శిబిరంలో సినిమా పాటలు
- సరదాగా గడిపిన అధికారులు, పాలకులు
- ప్రభుత్వ కార్యక్రమమా..? పార్టీ మీటింగా..?
- ప్రయివేటు ఫంక్షన్‌ను తలపించిన పాటలు
- అధిక సౌండ్‌తో ఇబ్బందులు పడిన అనారోగ్య ప్రజలు
ప్రజాశక్తి - నంద్యాల రూరల్‌

     ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం క్షేత్రస్థాయిలో అధికారులు ఇష్టారాజ్యంగా చేపడుతున్నారు. నంద్యాల మండలంలోని కానాల గ్రామంలో శుక్రవారం చేపట్టిన జగనన్న ఆరోగ్య శిబిరంలో ఒక పక్క అనారోగ్యంతో వచ్చిన ప్రజలకు వైద్యులు వైద్య సేవలు అందిస్తుంటే మరో పక్క అధికారులు, పాలకులు కలిసి శిబిరంలో సినిమా పాటలు అధిక సౌండ్‌తో వింటూ సరదాగా గడిపారు. అధికారులను, పాలకులను చూసి ఇది జగనన్న ఆరోగ్య శిబిరమా? పార్టీ కార్యాలయమా అన్నట్లుగా ఉందని వైద్యం కోసం వచ్చిన ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, పాలకులు కలిసి ఈ కార్యక్రమాన్ని వారి నిర్లక్ష్యంతో అబాసుపాలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వైద్యులు, సిబ్బంది వచ్చిన ప్రజలను ఆరోగ్య సమస్యలను తెలుసుకుంటుండగా శిబిరంలో సినిమా, పార్టీ పాటలు పెట్టి వైద్య సేవలకు అంతరాయం కలిగిస్తున్నారు. ప్రశాంతంగా ఉండాల్సిన ఆరోగ్య సురక్ష శిబిరం ఫంక్షన్‌ హాల్‌ లాగా ఉందని, ఆ సౌండ్‌కు గుండె జబ్బులు ఉన్నవారి పరిస్థితి ఏమిటని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 

వైద్యం చెయ్యడానికి అడ్డంకిగా మారిన అధిక సౌండ్‌
వైద్యం చెయ్యడానికి అడ్డంకిగా మారిన అధిక సౌండ్‌