ప్రజాశక్తి - భీమడోలు
జగనన్న సురక్ష సేవలను వినియోగించుకోవాలని ఉంగుటూరు ఎంఎల్‌ఎ పుప్పాల వాసుబాబు కోరారు. మండలంలో శనివారం ఆయన పర్యటించారు. పర్యటనలో భాగంగా తొలుత కురెళ్లగూడెం గ్రామపంచాయతీలో రూ.40 లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని, అంబరుపేటలో రూ.40 లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనాలను ప్రారంభించారు. పాత అంబరుపేట గ్రామ కూడలిలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జగనన్న సురక్ష కార్యక్రమంలో పాల్గొన్న ఎంఎల్‌ఎ స్థానిక పంచాయతీ అభివృద్ధికి వివిధ పథకాల కింద సుమారు రూ.10 కోట్లు అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్‌పిటిసి తుమ్మగుంట భవాని, ఎంపిపి కనుమాల రామయ్య, ఆయా గ్రామ పంచాయతీలకు చెందిన సర్పంచిలు, ఎంపిటిసిలు భీమడోలు సొసైటీ అధ్యక్షులు రావిపాటి సత్య శ్రీనివాస్, కో ఆప్షన్ ఎంపిటిసి సభ్యులు సయ్యద్ ఆజం సాహెబ్, ఎఎంసి ఛైర్‌పర్సన్ ఇంజేటి నీలిమ జూనియర్, రామకుర్తి నాగేశ్వరరావు పాల్గొన్నారు.










