Jun 25,2023 01:07
ప్రజలతో మాట్లాడుతున్న తహశీల్దారు కవిత

ప్రజాశక్తి-పిట్టలవానిపాలెం: మండలంలోని ఖాజీపాలెం గ్రామ పరిధిలో జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా వాలంటీర్ల ద్వారా ప్రతి గడపకూ వెళ్లి అవగాహన కల్పించే కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్‌ కుంఠం అనూష ప్రసన్నరాజు, మండల తాహశీల్దారు కవిత పరిశీలించారు. అలాగే సురక్ష పథకం ద్వారా అందించే సేవలను ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కాంతకుమారి, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.