Jul 01,2023 17:17

బహిరంగ సభలో మాట్లాడుతున్న జడ్పిటిసి పుల్యాల దివ్య

జగనన్న సురక్ష పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి
ప్రజాశక్తి - పగిడ్యాల

      జగనన్న సురక్ష పథకాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని మాజీ జెడ్పిటిసి పుల్యాల నాగిరెడ్డి, జడ్పిటిసి పుల్యాల దివ్య, ఎంపీపీ మండ్ల మల్లేశ్వరి అన్నారు. శనివారం స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో జగనన్న సురక్ష బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నవరత్నాల భాగంగా ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారని ఇంకా ఈ పథకాలను అందని వారు జగనన్న సురక్ష ద్వారా అన్ని పథకాల విధంగా చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పెరుమాళ్ళ శేషన్న, మండల ఉపాధ్యక్షురాలు పల్లె అరుణమ్మ, వైసిపి నాయకులు పల్లె సత్యనారాయణ రెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.