Jun 23,2023 21:31

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ గిరీష

రాయచోటి :  జిల్లాలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయా లని కలెక్టర్‌ గిరీష అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని మినీ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహణపై ఎంప ిడిఒలు, తహశీల్దార్లతో విసి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా జగనన్న సురక్ష కార్యక్రమాన్ని అమలు చేస్తోందని జిల్లాలోని అధికారులందరూ బాధ్యతాయుతంగా ఈ కార్యక్ర మాన్ని నిర్వహించాలన్నారు. వాలంటీర్లు ప్రతి ఇంటిని సందర్శించి సంక్షేమ పథ కాలు, ప్రజా సమస్యలు సంత ప్త స్థాయిలో పరిష్కారమే లక్ష్యంగా పని చేయ లన్నారు. అర్హులై ఉండి ఎక్కడైనా లబ్ధి అందని వారుంటే వారిని గుర్తించి సమస్య పరిష్కారానికి కావల్సిన పత్రాలు సేకరించాలన్నారు. రేపు జరగబోయే వాలంటీర్ల ఇంటింటి సందర్శన కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఆయా గ్రామ సర్పంచ్‌, గహ సారథులు, సచివాలయం పంచాయతీ సెక్రటరీ, డిఆర్‌డిఎ నుంచి ఒక రిసోర్స్‌ పర్సన్‌, ఇంటింటికి వెళ్లాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని తహశీల్దార్‌లు, ఎంపి డిఒలు కచ్చితంగా విజిట్‌ చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్లినప్పుడు అనేక రకాల సమస్యలు వస్తాయని, ప్రజలు ఇచ్చే ప్రతి అర్జీని తప్పక తీసు కోవాలన్నారు. సర్వే జరిగే గ్రామాలలో ముందు రోజు సాయంత్రం క్యాంపు నిర్వహించే ప్రాంతము టైం ప్రజలకు టామ్‌ టామ్‌ ద్వారా తెలియజేయాలన్నారు. ఉదయం 9 గంటల నుంచి డోర్‌ టు డోర్‌ కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నారు. జగనన్న సురక్ష కార్యక్రమాలకు సంబంధించి స్థానిక ఎమ్మెల్యేకు షెడ్యూల్‌ పంపాలని నియోజకవర్గ మండల ప్రత్యేక అధికారికి సూచించారు. సచివా లయాల పరిధిలో ఒక్క ఇల్లు కూడా మిస్‌ కాకుండా వాలంటీర్లు 100 శాతం ఇంటింటికి వెళ్ళాలన్నారు. వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్తున్నారా లేదా అనేది ఎంప ిడిఒలు పరిశీలన చేయాలన్నారు. ప్రతి సచివాలయానికి ఒక మండల్‌ లెవల్‌ అధి కారిని ఇన్‌ఛార్జిగా నియమించి కార్యక్రమంలో ఎటువంటి సమస్యలు తలెత్త కుండా చూడాలని ఎంపిడిఒకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా కుల ధ్రువీకరణ, ఆదాయ ధ్రువీకరణ, జనన ధ్రువీకరణ, మరణ ధ్రువీకరణ, కుటుంబ దవీకరణ, వివాహ ధ్రువీకరణ, మ్యుటేషన్లు, ఫోన్‌ నెంబర్‌కు ఆధార్‌ అనుసం ధానం, పంట సాగు హక్కు కార్డు వంటి ముఖ్యమైన పత్రాలను నేరుగా ప్రజల ఇంటి వద్ద నూతనంగా రూపొందించిన యాప్‌లో ప్రజల సమస్యలను నమోదు చేసుకొని వారి పత్రాలను సేకరించి టోకెన్‌ నెంబర్‌ ద్వారా వారి సమ స్యను పరి ష్కారం చేసేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని పేర్కొన్నారు. ఆయా సమస్యలపై డిజిటల్‌ అసిస్టెంట్లు ఈ సర్వీస్‌ ద్వారా తప్పనిసరిగా సర్వీస్‌ రిక్వెస్ట్‌ నమోదు చేయా లన్నారు. ప్రతిరోజు సాయంత్రం కల్లా ఎన్ని అర్జీలు వచ్చాయి తదితర వివరాలతో కూడిన రిపోర్టు తమకు పంపాలన్నారు. జగనన్న సురక్ష కార్యక్ర మానికి సంబం ధించి కలెక్టరేట్లో కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేయడం జరుగుతుందని ఇందులో ఎటువంటి సమస్యలు తలెత్తిన వెంటనే కంట్రోల్‌ రూమ్‌కు తెలియ జేయాలన్నారు. క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్లినప్పుడు చాలా ఓపికగా, సహ నంతో, మర్యాదగా వారి సమస్యను విని వాటి పరిష్కారానికి కషి చేయా లన్నారు. నెల రోజులపాటు జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో జెసి ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌, డిఆర్‌ఒ సత్యనారాయణ, డిపిఒ ధనలక్ష్మి, డిఆర్‌డిఎ పీడీ సత్యనా రాయణ, గ్రామ, వార్డు సచివాలయ జిల్లా కో-ఆర్డినేటర్‌ మనోహర్‌రాజు, జడ్‌పి కో-ఆర్డినేటర్‌ రమణారెడ్డి, అధికారులు పాల్గొన్నారు.